Homeక్రీడలుక్రికెట్‌Happy Birthday Rohit Sharma: జట్టులో అవసరం లేదన్నారు.. హిట్ మ్యాన్ గా ఎదిగి...

Happy Birthday Rohit Sharma: జట్టులో అవసరం లేదన్నారు.. హిట్ మ్యాన్ గా ఎదిగి అందరి నోళ్లు మూయించాడు

Happy Birthday Rohit Sharma: అతడు అంతగా ఆడటం లేదు. లావుగా ఉన్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టడం లేదు. పరుగులు కూడా అంత వేగంగా తీయడం లేదు. జట్టులోకి ఎందుకు తీసుకున్నారు.. అవసరంలేదు.. కెరియర్ తొలి రోజుల్లో రోహిత్ శర్మ ఎదుర్కొన్న అనుమానాలు ఇవి. జట్టులో స్థానం స్థిరంగా ఉండేది కాదు. ఏదో విజిటింగ్ ప్రొఫెసర్ లాగా వస్తూ పోతూ ఉండేవాడు.

2013లో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ అతడి క్రికెట్ చరిత్రను మొత్తం మార్చేసింది. 2014లో శ్రీలంక జట్టు మీద 264 పరుగులు చేశాడు. శ్రీలంకపై 2017లో 208 పరుగులు చేశాడు. ఇలా మూడుసార్లు డబుల్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ కొనసాగుతున్నాడు.. వాస్తవానికి రోహిత్ అత్యంత బలంగా బ్యాటింగ్ చేస్తాడు. ఓపెనర్ గా వచ్చి మెరుపు ఆరంభాన్ని అందిస్తుంటాడు. ఒకానొక దశలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న వేళ.. రోహిత్ గట్టిగా నిలబడ్డాడు. ఎప్పుడైతే ఆస్ట్రేలియా మీద డబుల్ సెంచరీ చేశాడో.. అప్పుడే అతడి ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత అతడు వెనక్కి తిరిగి చూసుకోలేదు.. వన్డేలలో హిట్ మాన్ గా అవతరించాడు. టి20లలో అంతకంటే ఎక్కువ జోరు చూపించాడు. ముఖ్యంగా ఐపీఎల్లో ముంబై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీలు అందించి అద్భుతమైన నాయకుడిగా ఆవిర్భవించాడు.

టీమిండియాకు ధోని తర్వాత 2024లో టి20 వరల్డ్ కప్ అందించాడు రోహిత్ శర్మ. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ అందించాడు.. అంతేకాదు, టీమ్ ఇండియాను 2023 వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. ఫైనల్లో ఓటమి వల్ల ట్రోఫీ అందించలేకపోయాడు. ఆ బాధ తనకు జీవిత కాలం ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పాడు రోహిత్..

మైదానంలో కఠినంగా ఉండే రోహిత్.. మైదాన వెలుపల అత్యంత సుత్తి మెత్తగా ఉంటాడు. తోటి ప్లేయర్లతో సరదాగా కబుర్లు చెబుతూ నవ్విస్తుంటాడు. ఐపీఎల్ లో ముంబై జట్టు నుంచి అతడిని సారధి స్థానంలో తొలగించడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై రోహిత్ బహిరంగంగా మాట్లాడకపోయినప్పటికీ.. తన బాధను అంతర్గతంగా వ్యక్తం చేశాడు. కాని చివరికి ముంబై యాజమాన్యం చేసిన తప్పు ఇప్పుడు తెలిసి వస్తోంది. ప్రస్తుతం రోహిత్ గాయం వల్ల ముంబై జట్టులో కొనసాగలేక పోతున్నాడు. కాకపోతే అతని రాక కోసం ముంబై అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. దీనిని బట్టి రోహిత్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

గౌతమ్ గంభీర్ ఇబ్బంది పెట్టవచ్చు.. ముంబై యాజమాన్యం లెక్కచేయకపోవచ్చు. కానీ చరిత్రలో రోహిత్ కు అద్భుతమైన పేజీలు ఉన్నాయి. టీమిండియాకు టి20 వరల్డ్ కప్ అందించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా అందించాడు. మూడు డబుల్ సెంచరీలు చేసి సరికొత్త ఆటగాడిగా నిలుస్తున్నాడు.. ఇది సరిపోదా రోహిత్ అంటే ఏమిటో చెప్పడానికి.. happy birthday to you Hitman

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version