Homeఆధ్యాత్మికంToday 17 June 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు ఈ విషయాల్లో...

Today 17 June 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు ఈ విషయాల్లో అనుకోని ధన లాభం..

Today 17 June 2026 Horoscope:   జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు అనుకోకుండా శుభయోగం జరిగే అవకాశం ఉంది. మరికొన్ని రాశుల వారు వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావచ్చు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొత్తగా వస్తువులు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల కెరీర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. పెద్దల సలహాతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులు శుభవార్తల విని అవకాశం ఉంటుంది. గతంలో చేపట్టిన పనులన్నిటిలో ఈరోజు పూర్తి చేస్తారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. వివిధ రంగాల్లో పనిచేసే వారికి ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు అనేక విషయాల్లో లాభాలు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు ఉంటాయి. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సింహరాశి వారికి ఈరోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటుంది. కొత్త వస్తువుల కొనుగోలుపై దృష్టి పెడతారు. వ్యాపారులకు ఆ గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేయకుండా ఉండాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు అనుకూలమైన వాతావరణ ఉంటుంది. కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకోకుండా అదృష్టం వరించి అవకాశం ఉంది. దీంతో అపారమైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఎవరికైనా డబ్బు ఇచ్చే విషయంలో ఆలోచించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వసూలు అవుతుంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. నాణ్యమైన ఉద్యోగ ప్రదర్శన ద్వారా ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. విదేశాలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. ఆస్తుల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. విదేశాలకు వెళ్లాలని అనుకుంటే ఇదే మంచి సమయం. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధించేందుకు వ్యాపారులు సిద్ధమవుతారు. అనుకున్న కోరికలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అనుకోకుండా సంపద తిరిగే అవకాశం ఉంటుంది. శక్తి సమస్యల మీదకు ఖర్చులు చేస్తారు. అయితే కొత్త వస్తువులు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉండే అవకాశం ఉంది. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కోపాన్ని నియంత్రించుకోవాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో గొడవలు ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో సమ్యమనం పాటించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో ప్రశాంతంగా ఉంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. 40 రోజుల్లోనే!

AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న తరుణంలో.. స్థానిక సంస్థల ఎన్నికలను సైతం...

AP BJP: ఏపీ బీజేపీకి ఏమైంది?!

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. ఆ పార్టీ అనుకున్న స్థాయిలో ముందుకెళ్లడం లేదు. పొత్తులో భాగంగా సీట్లు, ఓట్లు పెరిగాయే తప్ప.. గత...

AP Government Door To Door Campaign: చేసింది చెప్పేందుకు…ఏపీలో 45 రోజుల కూటమి ప్రచారం!

AP Government Door To Door Campaign: ఏపీలో టీడీపీ కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. మరో మూడేళ్ల పాలన ఉంది. తొలి రెండేళ్లు కూటమి పాలనపై సంతృప్తి శాతం అధికంగా...

Ranganath Controversy: ఆ భూమే.. హైడ్రా రంగనాథ్ కు ఇబ్బందికరం.. ఇంతకీ ఆ వివాదం ఏంటంటే..

Ranganath Controversy: హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ హైదరాబాద్ నగరంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అక్రమార్కుల భరతం పడుతున్నారు. భూకబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నారు. ప్రభుత్వం ఆయనకు పూర్తి స్వేచ్ఛ...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...
Oktelugu Epaper
Exit mobile version