Homeక్రీడలుక్రికెట్‌India Cricket Schedule: క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. టీమిండియా అభిమానులకు ‘తీన్’మారే..12 గంటలు నాన్ స్టాప్...

India Cricket Schedule: క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. టీమిండియా అభిమానులకు ‘తీన్’మారే..12 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్

India Cricket Schedule: మనలో చాలామందికి క్రికెట్ చాలా ఇష్టం. మన జట్టు ఆడుతుంటే క్రికెట్ చూస్తూ ఉంటాం. చివరికి ఇతర జట్లు ఆడుతుంటే కూడా చూస్తూనే ఉంటాం. ఎందుకంటే క్రికెట్ అనేది మనకు ఒక ఎమోషన్. పరాయి క్రీడ అయినప్పటికీ.. మనదేశంలోనే పుట్టిందన్నట్టుగా మనం ఆ క్రీడను ఓన్ చేసుకున్నాం. ఐపీఎల్ లాంటి టోర్నీ జరిపే మాత్రం మైదానాలు తాండోపతండాలుగా అభిమానులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. దీనినిబట్టి క్రికెట్ అంటే మన వాళ్లకు ఏ స్థాయిలో ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

ఇండియా ఆడే మ్యాచ్ లను కంటి రెప్ప ఆర్పకుండా అభిమానులు చూస్తారు. అటువంటిది ఒకేరోజు ఇండియా మూడు మ్యాచ్లు ఆడితే.. ఆనందం ఎలా ఉంటుంది
.. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్రికెట్ మజా సాగిపోతే ఎలా ఉంటుంది.. ఇప్పుడు ఇదే అనుభూతిని అభిమానులకు అందించేందుకు భారత క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారు.

ట్రై సిరీస్ లో భాగంగా భారత్ నేడు అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో పోటీ పడబోతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా భారీ తేడాతో గెలవాలి. అలా గెలిస్తేనే ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ ఉదయం పదిగంటల నుంచి మొదలవుతుంది. సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతూ ఉంటుంది.

భారత సీనియర్ల జట్టు ఆఫ్ఘనిస్తాన్ తో రెండవ వన్డే మ్యాచ్ లక్నో లో ఆడుతోంది. ఇటీవల ధర్మశాలలో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే లక్నోలో గెలిచి.. ట్రోఫీ అందుకోవాలని భారత్ భావిస్తుంది. టీమ్ ఇండియా ప్లేయర్లు సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు.

మరోవైపు భారత మహిళల జట్టు టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఐర్లాండ్ జట్టుతో నేడు పోటీ పడబోతోంది. సాయంత్రం ఏడు గంటల నుంచి ఈ మ్యాచ్ మొదలవుతుంది. జియో హాట్ స్టార్ లోలైవ్ స్ట్రీమ్ అవుతుంది. భారత ఏ జట్టు నుంచి మొదలు పెడితే మహిళల జట్టు వరకు మూడు మ్యాచ్లు ఒకే రోజు ఉండడం.. అది కూడా గంటల వ్యవధిలో సాగుతూ ఉండడంతో.. అభిమానులకు వీనుల విందైన క్రికెట్ ఆనందం లభించనుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Bonda Uma Maheswara Rao: బోండా ఉమా పై వైసీపీ స్కెచ్!

Bonda Uma Maheswara Rao: ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టిడిపిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. దీనిపై టిడిపి హై కమాండ్ ఆగ్రహంగా...

Loan Advice: అప్పు ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఏం జరుగుతుంది?

Loan Advice: డబ్బు ప్రతి ఒక్కరికీ అవసరం ఉంటుంది. అయితే కొందరి వద్ద తక్కువగా.. మరికొందరి వద్ద ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డబ్బు ఉన్న వారి వద్ద లేనివారు అప్పుగా...

AP Ration Cards: ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్!

AP Ration Cards: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరింత నాణ్యమైన బియ్యం అందించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు స్టీమ్డ్ రైస్ అందించనుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా ఈ...

Tollywood Heroes Injuries: టాలీవుడ్ కు ఏంటీ శాపం.. హీరోల వరుస గాయాల వెనుక ఏముంది..?

Tollywood Heroes Injuries: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు బిజీగా ఉన్నారు. ఒక్కో సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళుతున్న మన స్టార్ హీరోలు ఎలాంటి డూపులు...
Oktelugu Epaper
Exit mobile version