పెళ్లికావడం లేదని పెరుగుతున్న ఆత్మహత్యలు

దేశంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ప్రేమానుబంధాల వైఫల్యం, కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులు, అనారోగ్యం, అప్పుల బాధలు, మానసిక వేదనకు గురికావడం, మద్యానికి బానిస కావడం.. కారణం ఏదైనా వాటి పరిష్కారానికి ఆలోచించాల్సింది పోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇంకా ఈసారి ఆత్మహత్యల లెక్కల్లో వింతగా పెండ్లి కావడం లేదని యువత చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈసారి జాతీయ నేర గణాంకాల మండలి (ఎన్‌సీఆర్‌‌బీ) విడుదల చేసిన తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. గత […]

Written By: NARESH, Updated On : September 7, 2020 5:57 pm
Follow us on

దేశంలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ప్రేమానుబంధాల వైఫల్యం, కుటుంబ కలహాలు, వరకట్న వేధింపులు, అనారోగ్యం, అప్పుల బాధలు, మానసిక వేదనకు గురికావడం, మద్యానికి బానిస కావడం.. కారణం ఏదైనా వాటి పరిష్కారానికి ఆలోచించాల్సింది పోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇంకా ఈసారి ఆత్మహత్యల లెక్కల్లో వింతగా పెండ్లి కావడం లేదని యువత చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు వెల్లడైంది. ఈసారి జాతీయ నేర గణాంకాల మండలి (ఎన్‌సీఆర్‌‌బీ) విడుదల చేసిన తాజా నివేదికలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. గత 11 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా 2019లోనే సూసైడ్‌ చేసుకున్నారు. 1,39,123 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు.

దేశంలో ఏ సమస్య వచ్చినా అన్నీ పేదవాడికే. ఎన్‌సీఆర్‌‌బీ రిపోర్టులోనూ అదే వెల్లడించింది. ఎక్కువగా పేదలే ఆత్మహత్యలకు పాల్పడినట్లు చెప్పింది. ఈ జాబితా ప్రకారం.. 1,39,123 మందిలో 92,083 మంది చనిపోగా.. వీరంతా లక్షలోపు ఆదాయం ఉన్నవారే. 41,197 మంది రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారు ఉన్నారంట. మొత్తం ఆత్మహత్య చేసుకున్న వారిలో 95.8 శాతం లక్ష, ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న వారేనట.

గతంలో 2011లో 1,35,585 మంది బలవన్మరణానికి పాల్పడగా.. ఆ తర్వాత తగ్గాయి. 2017లో 1,29,887 ఆత్మహత్యలే నమోదయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరిశీలిస్తే.. గతేడాది తెలంగాణలో 7,675 మంది, ఏపీలో 6,465 మంది సూసైడ్‌ చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన ఆత్మహత్యల్లో 10 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌ మహానగరంలో 389 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా.. సగటు పరంగా చూస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. ఫస్ట్‌ మూడు ప్లేసుల్లో ఛత్తీస్‌గఢ్‌ (26.4), కేరళ (24.3), తెలంగాణ (20.6) శాతంతో నిలిచాయి.

అప్పుల బాధతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 5,908 ఊపిరి తీసుకుంటే తెలంగాణలో 989 మంది, ఏపీలో 828 మంది బలయ్యారు. పరీక్షలు తప్పామన్న బాధతో 2,744 మంది బలిపీఠం ఎక్కారు. మానసిక ఆందోళనలతో 11,009 మంది, కుటుంబ సమస్యలతో, అనారోగ్యంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. కాగా.. పెళ్లి కావడం లేదని 2,331 మంది ప్రాణాలు తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.