Gujarat Titans vs Mumbai Indians : కన్నడ, అయ్యర్ జట్ల మధ్య జరిగిన ముల్లన్ పూర్ వేదికలోనే ముంబై, గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు పంజాబ్ తో తలపడుతుంది. ఈ పోటీలో ఓడిపోయిన జట్టు ఐపిఎల్ నుంచి నిష్క్రమిస్తుంది. భవితవ్యాన్ని నిర్దేశించే మ్యాచ్ కావడంతో గుజరాత్, ముంబై మధ్య పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గుజరాత్, ముంబై జట్లలో భీకరమైన ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి పోటీ అద్భుతంగా సాగుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ పిచ్ బౌలర్లకు సహకరిస్తుంది .. అందువల్ల టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వైపు మొగ్గు చూపించే అవకాశం ఉంది..
ఇక ఈ సీజన్లో గుజరాత్ ప్రారంభంలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. అయితే అత్యంత కీలకమైన ప్లే ఆఫ్ దశలో రెండు వరుస ఓటములను సాధించింది. దీంతో ఫస్ట్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్ కి పడిపోయింది. లీగ్ స్టేజ్లో 14 మ్యాచ్లలో తలపడి.. 9 విక్టరీలు అందుకుంది. ఐదు ఓటములతో 18 పాయింట్లు మాత్రమే అందుకుంది. గిల్, సాయి సుదర్శన్, బట్లర్ తిరుగులేని ఫామ్ లో ఉండడం గుజరాత్ జట్టుకు లాభించే అంశం. అయితే బట్లర్ నేషనల్ టీం కోసం ఆడేందుకు స్వదేశానికి వెళ్లిపోవడంతో గుజరాత్ జట్టుకు తీవ్రమైన లోటు ఏర్పడింది. మొత్తంగా గిల్, సాయి సుదర్శన్ మీద గుజరాత్ విపరీతంగా డిపెండ్ అయ్యింది. రుథర్ఫోర్డ్, రాహుల్ తేవాటియ, షారుక్ ఖాన్ ఇంతవరకు తమ సత్తా చాటు లేదు.. అయితే వీరు ముంబై జట్టుతో జరిగే మ్యాచ్లో తమను తాము నిరూపించుకోవాల్సి ఉంది. వీరిపై జట్టు కూడా భారీగా ఆశలు పెట్టుకుంది. అర్షద్ ఖాన్, ప్రసిధ్ కృష్ణ సత్తా చాటితే గుజరాత్ జట్టుకు తిరుగు ఉండదు.
Also Read : రోహిత్ సూచన పాటించిన హార్దిక్.. కట్ చేస్తే మూడు వికెట్లు..
ఇక ఈ సీజన్లో ప్రారంభంలో అత్యంత నిరాశ జనకమైన ఆట తీరు ప్రదర్శించిన ముంబై.. ఒక్కసారి గా జూలు విధిల్చింది. 14 మ్యాచ్లలో 8 విక్టరీలు అందుకుంది. ఆరు ఓటములతో 16 పాయింట్లు సాధించి ఫోర్త్ ప్లేస్లో నిలిచింది. అయితే ఫారిన్ ప్లేయర్లు జట్టు నుంచి వెళ్లిపోవడం ఒకరకంగా ముంబైకి ఇబ్బందికరంగా మారింది. విల్ జాక్స్, రికెల్టన్ నేషనల్ టీం కోసం ఆడేందుకు వారి సొంత దేశాలకు వెళ్లిపోయారు. దీంతో రోహిత్ శర్మతో కలిసి బెయిర్ స్టో ఇన్నింగ్స్ మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక సూర్య కుమార్ తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా గొప్ప ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. తిలక్ వర్మ తనను తాను నిరూపించుకోవాలి. బౌలింగ్లో బుమ్రా చెలరేగిపోతున్నాడు. బౌల్ట్ అదరగొడుతున్నాడు. అశ్విని కుమార్ కీలక దశలో వికెట్లు పడగొడుతున్నాడు. దీపక్ చాహర్ చెలరేగిపోతున్నాడు. శాంట్నర్ దుమ్ము రేపు తున్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ మీద కాస్త పట్టు సాధిస్తే తిరుగు ఉండదు.
ఇక ఈ సీజన్లో గుజరాత్, ముంబై రెండుసార్లు తలపడ్డాయి. రెండు సందర్భాల్లో కూడా గుజరాత్ విజయం సాధించింది. వాస్తవానికి బౌలింగ్, బ్యాటింగ్లో గుజరాత్ కంటే ముంబై పటిష్టంగా ఉంది. అయినప్పటికీ గుజరాత్ సమష్టి తత్వాన్ని నమ్ముకుంది. ఎక్కడ కూడా పొరపాటుకు తావు ఇవ్వకుండా ముంబై జట్టుపై రెండు వరుస విజయాలు సాధించింది. ఇక google ప్రి డిక్షన్ ప్రకారం ముంబై జట్టుకు గెలవడానికి 59 శాతం, గుజరాత్ జట్టుకు 41% అవకాశాలున్నట్టు తెలు