https://oktelugu.com/

GT vs RCB : అతడు బంతి విసిరిన వేగానికి.. వికెట్ ఎగిరి పడ్డది.. వైరల్ వీడియో

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 200 రన్స్ చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : April 29, 2024 / 10:03 AM IST

    GT vs RCB : Clean bowled to a brilliant yorker by Mohammad Siraj

    Follow us on

    GT vs RCB : అప్పట్లో బాలాజీ అనే ఒక బౌలర్ ఉండేవాడు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అతడు అద్భుతంగా బౌలింగ్ చేసేవాడు. పేస్ బౌలింగ్ లో నిప్పులు చెరిగే విధంగా బంతులు వేసేవాడు. ఆ బంతుల వేగానికి వికెట్లు విరిగిపడేవి. అప్పట్లో పాకిస్తాన్ దేశంలో భారత్ పర్యటించినప్పుడు.. ఓ వన్డే మ్యాచ్లో బాలాజీ వేగంగా విసిరిన బంతికి పాకిస్తాన్ బ్యాటర్ అనిపించింది వికెట్ విరిగి ఎక్కడో పడింది. ఇప్పటికీ దాని గురించి క్రికెట్ వర్గాలు చర్చించుకుంటూనే ఉంటాయి. సరిగ్గా అలాంటి బంతినే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ వేశాడు. ఫలితంగా వికెట్ ఎగిరి ఎక్కడో గాల్లో పడింది.

    ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 200 రన్స్ చేసింది. గుజరాత్ జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించకపోయినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు స్థిరంగా నిలబడటంతో.. గుజరాత్ 200 స్కోరు సాధించింది. సాయి సుదర్శన్ 84*, మిల్లర్ 26* పరుగులు చేసి ఆకట్టుకున్నారు. బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్, మాక్స్ వెల్, సిరాజ్ తలా ఒక వికెట్ తీశారు.

    ఈ మ్యాచ్లో సిరాజ్ పడగొట్టిన వికెట్ హైలెట్ గా నిలిచింది. ” గత కొద్ది రోజులుగా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు, టీ 20 వరల్డ్ కప్ లో చోటు అనుమానమే” అనే వ్యాఖ్యలు వినిపిస్తున్న నేపథ్యంలో.. సిరాజ్ గుజరాత్ జట్టుపై అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బెంగళూరు బౌలింగ్ భారం మొత్తం ఒక్కడే మోసాడు. పదునైన బంతులు వేస్తూ గుజరాత్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ముఖ్యంగా గుజరాత్ ఆటగాడు షారుక్ ఖాన్ ధాటిగా ఆడుతున్న క్రమంలో.. అద్భుతమైన యార్కర్ వేసి క్లీన్ బౌల్డ్ చేశాడు. సిరాజ్ వేసిన బంతివేగానికి వికెట్ ఎక్కడో ఎగిరి పడిపోయింది. దీంతో బెంగళూరు అభిమానులు మైదానంలో ఎగిరి గంతేశారు.

    గుజరాత్ ఇన్నింగ్స్ ను సాయి సుదర్శన్, షారుక్ ఖాన్ నిలబెట్టారు. వీరిద్దరే స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. ఒకానొక దశలో 14 ఓవర్లకు వికెట్ నష్టానికి 131 స్కోర్ చేసిన గుజరాత్.. భారీ స్కోరు దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు కెప్టెన్ డూ ప్లేసిస్ సిరాజ్ కు బంతి ఇచ్చాడు. తనపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని సిరాజ్ వమ్ము చేయలేదు. 15 ఓవర్ తొలి బంతికి షారుఖ్ ఖాన్ ను సిరాజ్ వెనక్కి పంపించాడు. ఆడేందుకు ఏమాత్రం సాధ్యం కాని బంతిని వేసి వికెట్ ను ఎగరగొట్టాడు.. దీంతో షారుక్ – సుదర్శన్ 86 పరుగుల పార్ట్నర్ షిప్ బ్రేక్ అయింది. షారుక్ అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్ బ్యాటింగ్ భారాన్ని ఎత్తుకున్నాడు. 34 బాల్స్ లో అర్థ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. మిల్లర్ తో కలిసి గుజరాత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.. చివరి 3 ఓవర్లలో 47 రన్స్ కొట్టాడంటే.. సాయి సుదర్శన్ ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు.