https://oktelugu.com/

NTR: ముంబైలో ఎన్టీఆర్ క్రేజ్… బర్త్ డే రోజు అభిమాని కోరిక తీర్చిన యంగ్ టైగర్, వీడియో వైరల్

వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ మరొక హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నార్త్-సౌత్ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న వార్ 2 బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 29, 2024 / 10:03 AM IST

    Jr NTR made a fan day by clicking selfie

    Follow us on

    NTR: ఆర్ ఆర్ ఆర్ స్టార్ ఎన్టీఆర్ ముంబైలో సందడి చేస్తున్నాడు. అక్కడి స్టార్స్ తో కలిసి ప్రైవేట్ పార్టీలలో పాల్గొంటున్నాడు. వార్ 2 షూటింగ్ లో భాగంగా ఎన్టీఆర్ ఈ మధ్య ఎక్కువగా ముంబైలో ఉంటున్నారు. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న వార్ 2 షూటింగ్ ముంబైలో జరుగుతున్న విషయం తెలిసిందే. వార్ 2 కోసం ఎన్టీఆర్ లుక్ మార్చేశాడు. షార్ట్ హెయిర్ కట్ లో సూపర్ స్టైలిష్ గా తయారయ్యారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో రా ఏజెంట్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఆ పాత్రకు తగ్గట్లు ఎన్టీఆర్ మేకోవర్ అయ్యారు.

    వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ మరొక హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. నార్త్-సౌత్ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న వార్ 2 బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ముంబైలో తాత్కాలికంగా మకాం వేసిన ఎన్టీఆర్ అక్కడ హల్చల్ చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్ ని బాలీవుడ్ మీడియా వెంటాడుతుంది. అభిమానులు ఆయన్ని చూసేందుకు ఎగబడుతున్నారు.

    కాగా ఆదివారం రాత్రి ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతితో పాటు ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. బాంద్రాలో లో జరిగిన ఈ పార్టీకి రన్బీర్ కపూర్, అలియా భట్ సైతం జంటగా హాజరయ్యారు. మీడియా, ఫ్యాన్స్ ఎన్టీఆర్ దంపతులను చుట్టుముట్టారు. కాగా ఓ లేడీ ఫ్యాన్… ఎన్టీఆర్ సర్ ఈ రోజు నా బర్త్ డే, ఒక్క ఫోటో కావాలని అడిగింది. అందుకు అంగీకరించిన ఎన్టీఆర్ అభిమానితో సెల్ఫీ దిగాడు. బర్త్ డే వేళ ఆమె ఎన్నడూ మర్చిపోలేని అనుభూతి ఎన్టీఆర్ పంచాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది.

    మరోవైపు దేవర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర రెండు భాగాలుగా విడుదల కానుంది. దాదాపు రూ. 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేవర తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేస్తున్నాడు. అక్టోబర్ 10న దసరా కానుకగా దేవర విడుదల కానుంది. దేవర, వార్ 2 చిత్రాల అనంతరం ఎన్టీఆర్ కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తాడు.