GT vs PBKS : గుజరాత్ వర్సెస్ పంజాబ్.. ఉత్కంఠపోరులో ఎవరిదో విజయం?

ముల్లాన్ పూర్ మైదానంలో హైయెస్ట్ స్కోర్ 192 పరుగులుగా నమోదయింది. ఈ మైదానం బౌలర్లకు స్వర్గధామం లాగా ఉంటుంది. ఇక ఇప్పటివరకు గుజరాత్, పంజాబ్ నాలుగు సార్లు తలపడగా.. గుజరాత్ రెండుసార్లు, పంజాబ్ ఒకసారి విజయం సాధించాయి. ఒక మ్యాచ్ రద్దయింది

Written By: NARESH, Updated On : April 21, 2024 12:16 pm

PBKS-vs-GT-1

Follow us on

GT vs PBKS : ఐపీఎల్ 17 సీజన్లో మరో ఉత్కంఠ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఆదివారం రాత్రి పంజాబ్, గుజరాత్ జట్లు తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు 8, 9 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇటీవలి మ్యాచులలో గుజరాత్, పంజాబ్ వరుసగా ఓడిపోయాయి. దీంతో ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు అత్యంత కీలకంగా మారింది..

పంజాబ్

పంజాబ్ జట్టు బ్యాటింగ్ భారాన్ని శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మ వంటి వారు మోస్తున్నారు. బెయిర్ స్టో, రొసౌ, హర్ ప్రీత్ బ్రార్, సామ్ కరణ్, సికిందర్ రాజా వంటి వారు విఫలమవుతున్నారు. కీలక సమయాల్లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతుండడం జట్టు విజయాలపై ప్రభావం చూపిస్తోంది. కెప్టెన్ శిఖర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ జట్టు భారీ స్కోరు సాధించలేకపోతోంది. ఇక బౌలింగ్ విభాగంలో సామ్ కరణ్, రబాడా మాత్రమే రాణిస్తున్నారు. అర్షల్ పటేల్, వోక్స్ వంటి వారు సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లు ధారాళంగా పరుగులు ఇస్తుండడం పంజాబ్ జట్టును ఇబ్బందికి గురి చేస్తోంది.

గుజరాత్

ఈ సీజన్లో గుజరాత్ ప్రయాణం అత్యంత పేలవంగా సాగుతోంది. పేరుకు బ్యాటింగ్ లైనప్ భారీగానే ఉన్నప్పటికీ గిల్, సాయి సుదర్శన్ మాత్రమే ఆ జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నారు. కెన్ విలియంసన్, వృద్ధిమాన్ సాహ, మాథ్యూ వేడ్ వంటి వారు టచ్ లోకి వస్తే గుజరాత్ జట్టుకు తిరుగుండదు. బౌలింగ్ భాగంలో మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ మాత్రమే వికెట్లు తీస్తున్నారు. మిగతావారు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. అది గుజరాత్ జట్టు ఆట తీరును తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా బౌలర్లు టచ్ లోకి రావాలని ఆ జట్టు భావిస్తోంది.

ముల్లాన్ పూర్ మైదానంలో హైయెస్ట్ స్కోర్ 192 పరుగులుగా నమోదయింది. ఈ మైదానం బౌలర్లకు స్వర్గధామం లాగా ఉంటుంది. ఇక ఇప్పటివరకు గుజరాత్, పంజాబ్ నాలుగు సార్లు తలపడగా.. గుజరాత్ రెండుసార్లు, పంజాబ్ ఒకసారి విజయం సాధించాయి. ఒక మ్యాచ్ రద్దయింది

జట్ల అంచనా ఇలా

పంజాబ్

శిఖర్ ధావన్ (కెప్టెన్), రొసౌ, లివింగ్ స్టోన్, అశుతోష్ శర్మ, జితేష్ శర్మ, ప్రభ్ సిమ్రాన్ సింగ్, జానీ బెయిర్ స్టో, సామ్ కరణ్, శశాంక్ సింగ్, అర్ష్ దీప్ సింగ్, రబాడా.

గుజరాత్

గిల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, కేన్ విలియంసన్, సాయి సుదర్శన్, వృద్ధిమాన్ సాహ, వేడ్, రాహుల్ తేవాటియ, విజయ్ శంకర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్.