Dhoni Vs Kohli
Dhoni Vs Kohli: టీమిండియా 2011లో వన్డే వరల్డ్ కప్ సాధించింది. ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టును ఓడించింది. అప్పుడు టీమ్ ఇండియాకు మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్నారు. నాటి జట్టులో విరాట్ కోహ్లీ కూడా ఉన్నారు. 2013లో టీమిండియాఛాంపియన్స్ ట్రోఫీని దక్కించుకుంది. నాడు కూడా టీం ఇండియాకు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వం వహించాడు. అప్పుడు కూడా జట్టులో విరాట్ కోహ్లీ కీలక ఆటగాడు. మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాలు అందించారు. వీరిద్దరూ ముఖ్య ఆటగాళ్లుగా పేరుపొందారు. మైదానంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది. ఇద్దరు కూడా తమ అనుభవాన్ని జట్టు విజయాలకు ఉపయోగించేవారు. ధోని తర్వాత టీమిండియా సారధ్య బాధ్యతలను విరాట్ కోహ్లీకి బీసీసీఐ అప్పగించింది. దాని వెనుక ఉన్నది కూడా మహేంద్రసింగ్ ధోని అని ఇప్పటికీ చెప్పుకుంటారు.
ఫ్యాన్ క్రేజ్ విషయంలో..
అభిమానుల ప్రేమను పొందే విషయంలో ధోని, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ముందే ఉన్నారు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి ఐదు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అత్యంత ప్రజాధరణ పొందిన ఆటగాడిగా మహేంద్ర సింగ్ ధోని కొనసాగుతున్నాడు.. ఐపీఎల్ లోనూ అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న ఆటగాడిగా మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు.. అయితే ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్నాడు. 2023 సీజన్ వరకు ధోని చెన్నై జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2023 సీజన్లో చెన్నై జట్టును ధోని విజేతగా నిలపాడు. 2024 సీజన్లో కెప్టెన్ నుంచి ధోని తప్పుకున్నాడు. ఆ బాధ్యతలను రుతు రాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కు అప్పగించాడు. ఇక బెంగళూరు జట్టు బాధ్యతలను రజత్ పాటిదార్ మోస్తున్నాడు. బెంగళూరు ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచింది. డిపెండింగ్ ఛాంపియన్ కోల్ కతా ను ఓడించి అదరగొట్టింది. ఇప్పుడు రెండో మ్యాచ్ చెన్నై వేదికగా చెన్నై జట్టుతో ఆడుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా బెంగళూరు, జట్టు తలపడుతున్న నేపథ్యంలో జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో విరాట్ కోహ్లీ, ధోనికి ఉన్న సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ ను ప్రదర్శించింది. ఇందులో మహేంద్ర సింగ్ ధోనీ కంటే విరాట్ కోహ్లీ నెటిజన్ల ఆదరణపరంగా విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కేంద్రంగా సాగుతున్న సోషల్ మీడియా ప్రచారం 53 శాతం గా ఉండగా.. ధోనికి అది 43 శాతం ఉంది.. అయితే ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు సంబంధించి జరుగుతున్న సోషల్ మీడియా కార్యకలాపాలకు కొలమానంగా మాత్రమే స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ ఈ నివేదికను బయట ప్రపంచానికి విడుదల చేసింది. అయితే వారిద్దరికీ ఉన్న ప్రజాదరణకు ఇది ఏమాత్రం కొల బద్ద కాదు. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ రూపొందించిన ఈ నివేదిక సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది..