GT VS CSK : గుజరాత్ జట్టు సొంతమైదానమైన అహ్మదాబాద్ లో ధోని సేన, గిల్ సేన తలపడ్డాయి. టాస్ నెగ్గిన ధోని మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ధోని సేన 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడింది. 230 రన్స్ స్కోర్ చేసింది. ఐపీఎల్ లో ఇప్పటివరకు అద్భుతంగా బౌలింగ్ చేసిన గిల్ సేన బౌలర్లు.. ఈ మ్యాచ్లో విఫలమయ్యారు. ఇక చెన్నై బ్యాటర్లు తొలిసారి వీర విహారం చేశారు. బ్రేవిస్, కాన్వే ఆఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఆయుష్ , ఉర్విల్ పటేల్, రవీంద్ర జడేజా మెరుపులు మెరిపించారు. ప్రసిద్ మినహా గుజరాత్ బౌలర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. అత్యంత ధారాళంగా పరుగులు ఇచ్చారు.
Also Read : కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ఇంటర్వ్యూ.. గిల్ ఏమన్నారంటే..
231 రన్స్ టార్గెట్ తో చేజింగ్ మొదలుపెట్టిన గిల్ సేన.. ఈ దశలోనూ టార్గెట్ దిశగా ప్రయాణించినట్లు కనిపించలేదు. ఎప్పటిలాగే సాయి సుదర్శన్ అదరగొట్టాడు. గిల్ త్వరగానే అవుట్ అయ్యాడు. మిగతా ప్లేయర్లు బట్లర్, రూథర్ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తేవాటియ వంటి వారు విఫలమయ్యారు. దీంతో గుజరాత్ 147 పరుగులకే కుప్ప కూలింది. చెన్నై బౌలర్లలో అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్ చెరి మూడు వికెట్లు పడగొట్టి.. గుజరాత్ జట్టు పతనాన్ని శాసించారు.. అయితే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో గుజరాత్ ఓడిపోవడంతో టాప్ -2 అవకాశాలు పూర్తిగా గల్లంతయిపోయాయి. ఈ ఓటమి ద్వారా ముంబై జట్టుకు లైన్ మరింతగా క్లియర్ అయింది. ప్రస్తుతం గిల్ స్క్వాడ్ ఖాతాలో 18 పాయింట్లు ఉన్నాయి. చెన్నై జట్టు చేతిలో ఎలాగూ ఓడిపోయింది కాబట్టి టాప్ -2 అవకాశాలను కోల్పోయినట్టే.. అయితే ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ జట్లు ఆడే తదుపరి మ్యాచ్లలో.. తమ ప్రత్యర్ధుల చేతిలో ఓడిపోవాలి..
ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ఓడిపోయేలాగా కనిపించడం లేదు. మరోవైపు బెంగళూరు కూడా హైదరాబాద్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో.. తదుపరి మ్యాచ్ కట్టుదిట్టంగా ఆడే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే టాప్ 2 అవకాశాలు ముంబై, బెంగళూరుకు పుష్కలంగా ఉన్నాయి. టేబుల్ టాపర్ గా నిన్నటి దాకా ఉన్న గుజరాత్.. ఒక్కసారిగా ఓటములు ఎదుర్కొని.. పరువు తీసుకుంటున్నది.
ఇటీవల ఢిల్లీపై ఏకంగా 10 వికెట్ల వ్యత్యాసంతో గిల్ బృందం గెలిచింది. కానీ లక్నో చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఆ ఓటమికి కొనసాగింపుగా చెన్నై చేతిలో తలవంచింది. మొత్తంగా మొదట్లో అద్భుతమైన ఆట తీరు కొనసాగించి.. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన గిల్ సేన.. చివరికి ఇలా మిగిలిపోవడం గుజరాత్ అభిమానులను బాధకు గురిచేస్తోంది. ఈ ఓటమితో గుజరాత్ టాప్ -2 అవకాశాలను దాదాపు కోల్పోయినట్టే.. ఒకవేళ గుజరాత్ టాప్ -2 లోకి వెళ్లాలంటే అద్భుతం జరగాలి.