OG Movie : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). నేటి తరం యూత్ ఆడియన్స్ మొత్తం ఈ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు తమ హీరోకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సంబరాలు చేసుకుంటారు. కానీ ఓజీ అప్డేట్ వచ్చినప్పుడు మాత్రం పూనకాలొచ్చి ఊగిపోతుంటారు. పవన్ అభిమానులు ఆ స్థాయిలో ఈ సినిమాకు కనెక్ట్ అవ్వడానికి కారణం, అది పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా అనే. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు బ్యాలన్స్ ఉన్నవి రీసెంట్ గానే మొదలైంది. పవన్ కళ్యాణ్ కొన్నిరోజుల పాటు షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ నెల 29 నుండి ముంబై లో జరిగే షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నాడు.
Also Read : ఎడారి కోతను అడ్డుకుంటున్న అడ్డుకుంటున్న ఆకలి.. సహారా నుంచి అనంతపురం వరకు..
ఇది కాసేపు పక్కన పెడితే కొద్దిసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 25 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ఒక బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఉన్న పోస్టర్ ని అయితే విడుదల చేయలేదు కానీ, క్రియేటివ్ గా సెప్టెంబర్ 25 అంటూ వేసిన పోస్టర్, దాని వెనుక ఉన్న బ్యాక్ గ్రౌండ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సెప్టెంబర్ 25 అనేది సాధారణమైన డేట్ కాదు. లాంగ్ వీకెండ్ తర్వాత సోమవారం రోజున దుర్గాష్టమి, అక్టోబర్ 1 న ఆయుధ పూజా, అక్టోబర్ 2న విజయ దశమి మరియు గాంధీ జయంతి, అక్టోబర్ 3 న తెలంగాణ లో హాలిడే. ఇలాంటి డేట్ పవన్ కళ్యాణ్ సినిమాకి పడి చాలా కాలమే అయ్యింది. సరిగ్గా గురి చూసి కొడితే ఈసారి 500 కోట్ల గ్రాస్ మొదటి వారం లోనే వస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బిజినెస్ మొత్తం అన్ని ప్రాంతాల్లో పూర్తి అయ్యింది. వచ్చే నెల లో విడుదల కాబోతున్న ‘హరి హర వీరమల్లు’ చిత్రం బిజినెస్ ఇంకా పూర్తి అవ్వలేదు. అలాంటిది ఈ సినిమా బిజినెస్ అన్ని ప్రాంతాల్లో పూర్తి అయ్యింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది. ఇకపోతే ‘హరి హర వీరమల్లు’ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఇప్పటికే మొదలు అయ్యాయి. నార్త్ అమెరికా లో 60 వేలకు పైగా డాలర్ల గ్రాస్ గడిచిన రెండు రోజుల్లో వచ్చింది. ఇది ఆల్ టైం రికార్డు కాదు కానీ, ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఆల్ టైం టాప్ 2 అనొచ్చు. ట్రైలర్ వచ్చిన తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వేరే లెవెల్ కి వెళ్తుందని అంటున్నారు ఫ్యాన్స్.
FIRING WORLDWIDE in cinemas on
25th September 2025…#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/DQAOFOrQxx
— DVV Entertainment (@DVVMovies) May 25, 2025