India Vs Pakistan World Cup: వరల్డ్ కప్ లో ఇండియన్ టీం అన్ని మ్యాచులో గెలుస్తూ వస్తున్నప్పటికీ ప్లేయర్ల విషయం లో మాత్రం ఇండియన్ టీం కి ప్రతిసారి ఎదురుదెబ్బ తగులుతుంది.మొన్నటి వరకు బుమ్రా, రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి ప్లేయర్లు గాయాల కారణం గా చాలా రోజుల పాటు ఇండియన్ టీం కి దూరమవ్వగా ఇప్పుడు ఇండియా లోనే నెంబర్ వన్ ప్లేయర్ గా ఉంటూ, ప్రపంచం లో నెంబర్ 2 ప్లేయర్ గా కొనసాగుతున్న శుభ్ మన్ గిల్ ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్ కారణం గా ప్రపంచ కప్ లో ఇండియా ఆడిన రెండు మ్యాచ్ లకి ఆయన దూరం గా ఉన్నాడు.నిజానికి గిల్ ఉంటె టీం కి అదనపు బలం చేకూరుతుంది. గిల్ మ్యాచ్ పొజిషన్ ని అంచన వేస్తూ బ్యాటింగ్ చేస్తూ ఇండియన్ టీం కి ఎక్కువ గా విజయాలను అందించడం లో చాలా వరకు ఇండియన్ టీం కి ఉపయోగ పడుతుంటాడు.
ఇక ఇలాంటి క్రమం లో ఇండియా పాకిస్థాన్ మీద ఆడే మ్యాచ్ లో గిల్ అందుబాటు లో ఉంటాడా, లేదా అనే విషయం మీద ఒక క్లారిటీ అయితే రావడం లేదు. ఎందుకంటే గిల్ ఇప్పటికే డెంగ్యూ ఫీవర్ నుంచి కోలుకున్నప్పటికీ కొంచం వీక్ అవ్వడం వల్ల ఆయనకి రెస్ట్ ఇస్తున్నారు. ఇక ఇప్పటికే గిల్ అహ్మదాబాద్ కి చేరుకొని బిసిసిఐ వైద్యుల టీం పర్య వేక్షణ లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు గా కూడా తెలుస్తుంది.అయితే ఈ మ్యాచ్ కి ఇంకా రెండు రోజుల సమయం ఉండటం వల్ల ఈ మ్యాచ్ కి గిల్ అందుబాటు లో ఉంటాడు అని తెలుస్తుంది.గిల్ టీం లో ఉంటె ఛేజింగ్ లో ఇండియా ఎంత పెద్ద భారీ స్కోర్ అయిన సరే ఈజీగా ఛేదిస్తుంది…
ఇక గిల్ టీం లోకి వస్తే ఇషాన్ కిషన్ మళ్లీ బెంచ్ కె పరిమితం కావాల్సి ఉంటుంది.నిజానికి ఇషాన్ కిషన్ కూడా ఆఫ్గనిస్తాన్ టీం మీద చాలా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు కానీ రోహిత్ శర్మ ఒక పెద్ద నాక్ ఆడటం తో ఇషాన్ కిషన్ చాలా వరకు డిఫెన్స్ గానే ఆడాడు.లేకపోతే ఇషాన్ కిషన్ కూడా ఒక భారీ ఇన్నింగ్స్ ఆడేవాడే అయితే గిల్ వస్తే ఇషాన్ కిషన్ గిల్ ఇద్దరు టీం లో ఉండడం కుదరదు అందువల్లే ఇషాన్ కిషన్ ని బెంచ్ కి పరిమితం చేస్తారు…గిల్ టీం లోకి రావడం వల్ల ఆయన టీం నుంచి బయటకి వెళ్తున్నారు అంతే తప్ప తను బాగా ఆడలేక పోవడం వల్ల మాత్రం కాదు…
ఇక గిల్ కోసం చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు దాంతో అయన కూడా తొందరగా రికవరీ అయి రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గిల్ పాకిస్థాన్ మ్యాచ్ లో వందకు వంద శాతం ఆడే అవకాశాలు ఉన్నాయి..దాంతో ఇండియన్ టీం పాకిస్థాన్ మీద మళ్లీ ఒక పెద్ద విజయాన్ని సొంతం చేసుకునే పనిలో ఉన్నట్టు గా తెలుస్తుంది.