Vijay Devarakonda: ఒక్క పాటతో యానిమల్ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ రాబట్టాడు సందీప్ రెడ్డి వంగా. గ్యాంగ్ స్టర్ డ్రామాలో వైలెన్స్ తో పాటు రొమాన్స్ దట్టించి వదిలాడు. ఇటీవల ‘అమ్మాయి’ అనే ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు. ఆ సాంగ్ ఇంటర్నెట్ ని షేక్ చేసింది. రష్మిక మందాన-రన్బీర్ కపూర్ పెదాలు జుర్రేసుకున్నారు. లెక్కకు మించిన ముద్దు సీన్స్ ఉన్నాయి. లిప్ లాక్ ల విషయంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని క్రాస్ చేశారనిపిస్తుంది. కుటుంబ సభ్యుల ముందే హీరో హీరోయిన్ లిప్ కిస్ చేయడం నభూతో నభవిష్యతి.
ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తల్లి మండిపడ్డారని టాలీవుడ్ టాక్. ఆ హీరో మూతి దారుణంగా నాకేస్తోంది, ఆమె నాకు కోడలు ఎలా అవుతుందని నిట్టూర్చిందట. విజయ్ దేవరకొండ రష్మికను ప్రేమిస్తున్నాడు. రష్మిక ఇంటి కోడలు కానుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో యానిమల్ మూవీ చిచ్చు పెట్టిందని అంటున్నారు. ఇప్పటి వరకూ రష్మికను కోడలిగా తెచ్చుకునే ఆలోచన ఉన్నా… అవి పటాపంచలు అయ్యాయని అంటున్నారు.
తల్లికి ఇష్టం లేని క్రమంలో విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి కావడం కష్టమే అంటున్నారు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అవుతుంది. రష్మిక కెరీర్ బిగినింగ్ లో హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించింది. అతడితో ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. హీరోయిన్ కావాలన్న తన కలకు పెళ్లి అడ్డు అవుతుందని భావించిన రష్మిక మనసు మార్చుకుంది. రక్షిత్ శెట్టితో వివాహం రద్దు చేసుకుంది.
అనంతరం టాలీవుడ్ లో అడుగుపెట్టి సక్సెస్ అయ్యింది. ఇక గీత గోవిందం చిత్రంలో మొదటిసారి విజయ్ దేవరకొండతో జతకట్టింది. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ బ్లాక్ బస్టర్ కొట్టింది. అనంతరం డియర్ కామ్రేడ్ చిత్రం చేశారు. ఈ చిత్రం మాత్రం నిరాశపరిచింది. ఈ రెండు చిత్రాల్లో విజయ్ దేవరకొండ-రష్మిక కెమిస్ట్రీ ఓ రేంజ్ లో ఉంటుంది. కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని టాక్. బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఒకటి రెండు సార్లు మాల్దీవ్స్ లో ఏకాంతంగా ఎంజాయ్ చేశారు. కానీ ఎఫైర్ వార్తలను ఖండిస్తూ ఉంటారు.