Suryakumar Yadav Shubman Gill: క్రికెట్లో జట్టును నడిపించేవాడు సమర్థవంతమైన పాత్ర పోషించాలి.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాలపై పట్టు ఉండాలి. ఒకవేళ నాయకుడికి బాగా బ్యాటింగ్ చేయడం వస్తే.. అతడు దానిని ప్రతి సందర్భంలో నిరూపించుకోవాలి. ఒకవేళ బౌలింగ్ చేయగలిగితే.. వికెట్లు సాధించి తన బౌలింగ్ సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. ఇక ఫీల్డింగ్ విషయంలో కూడా అతడు తన నేర్పరితనాన్ని ఎప్పటికప్పుడు చూపించాలి. మ్యాచ్ ప్రారంభం నుంచి చివరి వరకు ప్రతి సందర్భంలోనూ జట్టు మీద తన మార్క్ చూపిస్తూనే ఉండాలి..
జట్టు కు నాయకత్వం వహించే నాయకుడు మాత్రమే కాదు.. ఉప నాయకుడు కూడా ఇవన్నీ క్వాలిటీస్ కలిగి ఉండాలి. అప్పుడే జట్టు విజయాలు సాధించగలుగుతుంది. క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాలను లిఖించగలుగుతుంది. అలా కాకుండా సారధి తన సామర్థ్యాన్ని నిరూపించుకోకపోతే.. ఉప సారధి తన స్థాయిని ప్రదర్శించకపోతే జట్టుకు గెలుపులు దక్కవు. ఒకవేళ గెలిచినా కూడా మిగతా వాళ్ళ ప్రదర్శన ఆధారంగానే అది సాధ్యమవుతుంది.
ప్రస్తుతం టీమిండియాలో ముఖ్యంగా టి20 ఫార్మేట్ లో సారధి సూర్య కుమార్ యాదవ్ విఫలమవుతున్నాడు. ఉపసారథి గిల్ చేతులెత్తేస్తున్నాడు. వరుసగా వీరిద్దరూ విఫలమవుతున్నప్పటికీ టి20 క్రికెట్లో అవకాశాలు లభించడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. వాస్తవానికి వీరి కంటే కూడా చాలామంది ప్లేయర్లు గొప్పగా ఆడుతున్నారు.. గొప్పగా ఆడేవారిని వీరిద్దరి కోసం రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తున్నారు.. సంజు శాంసన్ అద్భుతమైన ఆటగాడు అయినప్పటికీ గిల్ కోసం అతడిని రిజర్వు బెంచ్ కు పరిమితం చేశారు. రుతు రాజ్ గైక్వాడ్ పరిస్థితి కూడా అలానే ఉంది. వాస్తవానికి గైక్వాడ్ టి20 స్పెషలిస్ట్. సమర్థవంతంగా బ్యాటింగ్ తో పాటు, బౌలింగ్ కూడా చేయగలడు. జట్టు మేనేజ్మెంట్ ఆశ్రిత పక్షపాతాన్ని ప్రదర్శించడంతో గిల్, సూర్య కుమార్ యాదవ్ వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు.
దక్షిణాఫ్రికా తో మంగళవారం జరిగిన టి20 మ్యాచ్ లో గిల్ విఫలమయ్యాడు.. ఒక బౌండరీ సాధించి.. మరుసటి బంతికి క్యాచ్ ఔట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ పరిస్థితి కూడా అలానే ఉంది.. గడిచిన 23 ఇన్నింగ్స్ లలో సూర్య కుమార్ యాదవ్ ఒక్కటంటే ఒక్కటి హాఫ్ సెంచరీ చేశాడు.. గిల్ కూడా గడిచిన 15 ఇన్నింగ్స్ లలో అతడు కూడా ఒకటంటే ఒకటే హాఫ్ సెంచరీ చేశాడు.. మొన్నటిదాకా మెడ నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడిన గిల్.. కొద్దిరోజుల పాటు బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స పొందాడు.. ఆ తర్వాత ఎటువంటి డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండానే నేరుగా జట్టులోకి వచ్చాడు..
హార్దిక్ పాండ్యా విషయంలో మాత్రం మేనేజ్మెంట్ ఇలా వ్యవహరించలేదు. అతడు డొమెస్టిక్ క్రికెట్లో నిరూపించుకున్న తర్వాతే టి20లోకి వచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించిన తర్వాత.. హార్దిక్ సౌత్ ఆఫ్రికా పై ఏకంగా సూపర్ హాఫ్ సెంచరీ చేశాడు. అది కూడా జట్టు విపరీతమైన కష్టాల్లో ఉన్నప్పుడు అతడు బ్యాటింగ్లోకి వచ్చాడు.. హార్దిక్ పాండ్యా విషయంలో ఒక న్యాయాన్ని పాటించిన మేనేజ్మెంట్.. గిల్ విషయంలో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది.. తొలి మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్, గిల్ విఫలమైన నేపథ్యంలో.. తదుపరి మ్యాచ్లో సత్తా చూపిస్తారా? వీరి స్థానంలో ఇతర ప్లేయర్లకు అవకాశం కల్పిస్తారా? ఈ ప్రశ్నలకు మేనేజ్మెంట్ సమాధానం చెప్తే ఇంకా బాగుంటుంది.