Gil : ఐపీఎల్ పేరు చెప్పగానే కొంతమంది ఆటగాళ్లు మన కళ్ళ ముందు కదలాడుతుంటారు. వాళ్లు తమ ప్రత్యర్థి జట్లపై ఆడిన తీరుతో సరికొత్తగా కనిపిస్తుంటారు. అయితే ఇక్కడ గెట్టు పంచాయితీలు.. వ్యక్తిగత తగాదాలు వంటివి ఉండవు. కాకపోతే ఆ జట్టును చూడగానే వారికి ఎక్కడా లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. వారి బ్యాట్ శివతాండవం చేస్తూ ఉంటుంది. బంతిని ప్రతీ సందర్భంలో బౌండరీ దాటించాలని చూస్తుంది. ఉదాహరణకు చెన్నై, ముంబై జట్లపై విరాట్, కోల్ కతా, చెన్నై జట్లపై రోహిత్ సూపర్ ఆటతీరు ప్రదర్శిస్తుంటారు. ఏమాత్రం వెనకడుగు వేయరు.. పైగా ప్రతి సందర్భంలోనూ తమదే పై చేయి లాగా ఆడుతుంటారు. ఇప్పుడు ఈ జాబితాలో గిల్ కూడా చేరినట్టు కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతడు శుక్రవారం హైదరాబాద్ జట్టుతో సొంత మైదానం(అహ్మదాబాద్)లో జరిగిన మ్యాచ్ లో అనితర సాధ్యమైన ఆటతీరు ప్రదర్శించాడు. ఉన్నంతసేపు మైదానంలో బంతిని ఉరుకులు పరుగులు పెట్టించాడు. అంతేకాదు హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
Also Read : సచిన్ కూతురు సారా తో రిలేషన్.. క్లారిటీ ఇచ్చిన గిల్.. వైరల్ వీడియో
ఎక్కడా తగ్గలేదు
హైదరాబాద్ జట్టు అంటే గిల్ కు ఎక్కడా లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. వీరోచితమైన స్థాయిలో బ్యాటింగ్ చేయాలనిపిస్తుంది కావచ్చు. అందువల్లే అతడు ఆడిన ప్రతి సందర్భంలోనూ ఫ్యాన్స్ ను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయడు. పైగా తనకు మాత్రమే సాధ్యమైన ఆట తీరుతో ఆకట్టుకుంటాడు. ఇక శుక్రవారం జరిగిన మ్యాచ్లో గిల్ ఏకంగా 76 రన్స్ చేశాడు. ఇదే జట్టుతో ఇదే ఐపిఎల్ లో ఇటీవల జరిగిన మ్యాచ్లో 61* పరుగులు స్కోర్ చేసి టెర్రిఫిక్ ఇన్నింగ్స్ ఆడాడు. గత సీజన్లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 36 పరుగులు చేశాడు. ఇక అదే సీజన్లో ఒక సెంచరీ కూడా కొట్టాడు. మొత్తంగా గత నాలుగు ఇన్నింగ్స్ ల ప్రకారం చూసుకుంటే హైదరాబాద్ పై గిల్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. గడచిన నాలుగు ఇన్నింగ్స్ లలో హైదరాబాద్ జట్టుపై గిల్ 101, 36, 61*, 76 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుపై 61 పరుగులు చేసిన గిల్.. గుజరాత్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక శుక్రవారం నాటి మ్యాచ్ లోనూ వీర విహారం చేశాడు..76 పరుగులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.. ” గిల్ కు హైదరాబాద్ జట్టును చూడగానే ఊపు వస్తుందనుకుంటా. హైదరాబాద్ బౌలర్లు అంటే ఏమాత్రం భయం లేదనుకుంటా. విపరీతంగా పరుగులు తీయడంతో పాటు.. మైదానం నలుమూలల అతడు బంతిని పరుగులు పెట్టిస్తున్నాడు. అతని ఆటను చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది..గిల్ ఇదే తీరుగా తన ఆట కొనసాగించాలని” గుజరాత్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నెలకొల్పిన గిల్ – సుదర్శన్