Shubman Gill: ఐపీఎల్ లో గుజరాత్ జట్టుకు కెప్టెన్ గా గిల్ కొనసాగుతున్నాడు. ప్రస్తుత సీజన్లో గుజరాత్ జట్టుకు వరుస విజయాలు అందించి.. మొదటి స్థానంలో నిలిపాడు. దాదాపు ప్లే ఆఫ్ దాకా జట్టును తీసుకెళ్లాడు. గిల్ ఆటతీరుతో ఎంతలా ఐతే పేరు తెచ్చుకున్నాడో.. రూమర్స్ తో కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీ అయిపోయాడు. అతడికి సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ తో ఏదో జరుగుతోందని.. వారిద్దరి మధ్య ఏదో ఉందని ఎప్పటినుంచో పుకార్లు ఉన్నాయి. దీనిపై అటు గిల్ కాని.. ఇటు సారా టెండూల్కర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక ఆ మధ్య సచిన్, సారా ఒకే హోటల్ రూమ్ లో కనిపించడం కూడా పుకార్లకు బలం చేకూర్చింది. ఇక సోషల్ మీడియాలో మీమ్స్ కు ఐతే లెక్కేలేదు.. ఇక గిల్ సెంచరీ చేసినప్పుడు.. సచిన్ టెండూల్కర్ ట్విట్టర్లో అభినందించినప్పుడు కూడా చాలామంది రకరకాలుగా వ్యాఖ్యలు చేసేవారు. సొంత అల్లుడిని సచిన్ భలేగా అభినందిస్తున్నాడని పేర్కొనేవారు. దానికి తమదైన వ్యాఖ్యను జోడించేవారు.
Also Read: చెన్నై ప్లేయర్లు అవుట్ అయితే తిట్టింది.. సీన్ కట్ చేస్తే సెలబ్రిటీ అయిపోయింది.. ఇక ఆఫర్లే ఆఫర్లు..
ఓపెన్ అయిపోయిన గిల్
సారా టెండూల్కర్ తో ఉన్న సంబంధం పై గిల్ తొలిసారిగా ఒక స్పష్టత ఇచ్చాడు… ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గిల్ క్లారిటీ ఇచ్చాడు. ” నేను 300 రోజులు క్రికెట్ తోనే ప్రయాణం సాగిస్తుంటాను. రకరకాల టోర్నీలతో బిజీగా ఉంటాను. ప్రాక్టీస్.. లేదా మ్యాచ్ లు ఆడుతూ ఊపిరి సలపనివ్వని ఒత్తిడిలో ఉంటాను. అలాంటప్పుడు ఇంకో వ్యక్తి గురించి ఆలోచించే అవకాశం నాకు ఎక్కడ ఉంది. నా ఫోకస్ క్రికెట్ మీద ఉంది. క్రికెట్ నా ఆశ.. క్రికెట్ నా ధ్యాస. అంతకుమించి ఏమీ లేదు. పలానా వ్యక్తితో నేను దగ్గరగా ఉన్నానని.. పలానా వ్యక్తితో నేను తిరుగుతున్నానని.. ఎప్పటినుంచో పుకార్లు ఉన్నాయి. విమర్శలు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీ సమక్షంలో నేను క్లారిటీ ఇస్తున్నాను. నేను చాలామంది ఆరోపిస్తున్నట్టు ఆ వ్యక్తితోనూ ఎటువంటి రిలేషన్ లో లేను. కనీసం ఆ వ్యక్తిని ఇంతవరకు చూడలేదు. మాట్లాడలేదు. కానీ కొంతమంది వ్యక్తులు కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఎప్పటినుంచో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. వాటి వల్ల ఏం ఉపయోగం ఉంటుందో నాకు అర్థం కాదు. ఒకటి నిజం.. నా కెరియర్ నాకు చాలా ముఖ్యం. దానికోసమే నేను కష్టపడుతున్నా. ఇక్కడ దాకా చేరుకోవడానికి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. అలాంటప్పుడు నాకు ప్రేమ, పెళ్లి వాటి గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉందని” గిల్ వ్యాఖ్యానించాడు. అయితే గిల్ మాట్లాడుతున్నంతసేపు సదరు మహిళ యాంకర్ నవ్వుతూ ఉండడం విశేషం. ముఖ్యంగా సారా పేరు ప్రస్తావించకుండా గిల్ మాట్లాడుతున్నప్పుడు.. ఆ లేడీ యాంకర్ ఆశ్చర్యకరంగా చూడడం ఇక్కడ గమనార్హం.
Shubman Gill has finally said it about his dating rumours with sara tendulkar. pic.twitter.com/GrThDLxCoR
— mufaddla parody (@mufaddl_parody) April 26, 2025