వైరల్: క్రికెట్ మ్యాచ్ లో దెయ్యం.. వికెట్లను ఇలా తీసింది

అది జింబాబ్వే-బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 మ్యాచ్. 18వ ఓవర్ లో బంగ్లాదేశ్ బ్యాట్ మెన్ మహ్మద్ సైఫుద్దీన్ క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్ టెండాయ్ చతారా బౌలింగ్ చేస్తున్నాడు. అయితే ఆ ఓవర్ లో 5వ బంతి పడకముందే ఎవరో బెయిల్స్ ను పడగొట్టారు. బ్యాట్స్ మెన్ ఏం తాకలేదు. కీపర్ వాటిని ఏం గిరాటేయలేదు. మరి వికెట్లను ఎవరు పడగొట్టారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎంపైర్లకు డౌట్ వచ్చింది. వెంటనే థర్డ్ అంపైర్ […]

Written By: NARESH, Updated On : July 27, 2021 5:12 pm
Follow us on

అది జింబాబ్వే-బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 మ్యాచ్. 18వ ఓవర్ లో బంగ్లాదేశ్ బ్యాట్ మెన్ మహ్మద్ సైఫుద్దీన్ క్రీజులో ఉన్నాడు. జింబాబ్వే బౌలర్ టెండాయ్ చతారా బౌలింగ్ చేస్తున్నాడు.

అయితే ఆ ఓవర్ లో 5వ బంతి పడకముందే ఎవరో బెయిల్స్ ను పడగొట్టారు. బ్యాట్స్ మెన్ ఏం తాకలేదు. కీపర్ వాటిని ఏం గిరాటేయలేదు. మరి వికెట్లను ఎవరు పడగొట్టారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఎంపైర్లకు డౌట్ వచ్చింది. వెంటనే థర్డ్ అంపైర్ కు నివేదించారు.

థర్డ్ ఎంపైర్ చూడగా ఎవరో వికెట్లను వెనక్కి అని స్టంప్ అవుట్ చేసినట్టు స్పష్టంగా కనిపించింది. కానీ ఎవరూ లేరు.. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

మ్యాచ్ లోకి దెయ్యం వచ్చిందని అదే నీడలా వికెట్లను తీసిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది.

ఆ టైంలో గాలి వల్ల కూడా ఇలా జరుగవచ్చని కొందరు దెయ్యం వాదనను కొట్టిపారేస్తున్నారు. కానీ బెయిల్స్ ను అలా వెనక్కి బలంగా లాగడం గాలితో కాదని కొందరు అంటున్నారు. మొత్తంగా దెయ్యం క్రికెట్ మ్యాచ్ లోకి వచ్చిందన్న వాదన తెగ వైరల్ గా మారింది.

https://twitter.com/MazherArshad/status/1418930070576586757?s=20