Gautam Gambhir: లెజెండరీ ఆటగాళ్లు శాశ్వత వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. జట్టులోకి కొత్త ఆటగాళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ కు జట్టుపై పూర్తిస్థాయిలో పట్టు చిక్కే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి టీం ఇండియాలో ఆటగాళ్లపై పట్టు సాధించడానికి అనిల్ కుంబ్లే, గ్రెగ్ చాపెల్ లాంటివారు ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేకపోయారు. చివరికి వారే వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు గౌతమ్ గంభీర్ కు అన్ని మంచి శకనములే అన్నట్టుగా పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతున్నాయి. అంతేకాదు గౌతమ్ గంభీర్ కు పూర్తిస్థాయిలో జట్టుపై పెత్తనం సాగించే సూచనలు కనిపిస్తున్నాయి..
Also Read: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేతిలో.. రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్…ఇంతకీ ఏమా కథ!
గౌతమ్ గంభీర్ కోచ్ గా వచ్చిన తర్వాత వన్డే, టి20 లలో భారత్ మెరుగైన విజయాలు సాధిస్తున్నప్పటికీ.. టెస్టులలో మాత్రం దారుణమైన వైఫల్యాలను నమోదు చేసింది. ఐసీసీ నిర్వహిస్తున్న మేజర్ టోర్నీలలో టీమిండియా సాధించని ట్రోఫీ ఏదైనా ఉందంటే.. అది కేవలం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ మాత్రమే. అయితే అందులో విజయం సాధించాలంటే టీమిండియా ఇప్పటినుంచే కష్టపడాలి. దిగ్గజ ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు ప్రకటించిన నేపథ్యంలో.. ఉన్నవారితోనే గౌతమ్ గంభీర్ విజయాలు సాధించేలాగా మార్చాలి.. ఇప్పటికే బుమ్రా తీవ్రంగా గాయాల బారిన పడడంతో అతడు టెస్ట్ ఫార్మాట్లో పూర్తిస్థాయిలో కొనసాగే అవకాశం లేదు. రవీంద్ర జడేజా కూడా ఎక్కువ కాలం జట్టులో ఉండే అవకాశం కూడా లేదు. మొత్తంగా చూస్తే గౌతమ్ గంభీర్ ఊహించినట్టుగానే జట్టులోకి యువ ఆటగాళ్లు వచ్చే అవకాశం ఉంది. అదే గనుక సాధ్యమైతే గౌతమ్ గంభీర్ చెప్పినట్టుగానే జట్టు ఆటగాళ్లు నడుచుకోవాల్సి ఉంటుంది. ఇక కేఎల్ రాహుల్ మెరుగ్గానే ఆడుతున్నప్పటికీ.. అతడు ఆడిన స్థిరమైన ఇన్నింగ్సే జట్టులో స్థానాన్ని నిర్దేశిస్తుంది. ఇక రిషబ్ పంత్, దృవ్ జూరెల్, సర్ఫరాజ్, జైస్వాల్ వంటి వారు తమ ఆట తీరుతో ఆకట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీరు కూడా సరిగా ఆడకపోతే.. ప్రత్యామ్నాయలు కూడా గౌతమ్ గంభీర్ ఎదుట చాలానే ఉన్నాయి. మొత్తంగా టెస్ట్ జట్టు గౌతమ్ గంభీర్ కంట్రోల్లోకి వెళ్లిపోయినట్టే. గౌతమ్ గంభీర్ ఆటగాళ్ళ నుంచి నూటికి నూరు శాతం ఎఫర్ట్ వచ్చేలాగా చూస్తాడు. అలా ఇవ్వని ఆటగాళ్లపై ఖచ్చితంగా వేటు వేస్తాడు. ఎందుకంటే టీం ఇండియా తదుపరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ లో ట్రోఫీ అందుకోవాలని భావిస్తోంది. జట్టు మేనేజ్మెంట్ కూడా అతడికి అపరిమితమైన అధికారాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఇవన్నీ జరిగితే అప్పుడు గౌతమ్ గంభీర్ టెస్ట్ జట్టులోనూ తనదైన మార్క్ ప్రదర్శిస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే గనుక జరిగితే గౌతమ్ గంభీర్ కు టీమిండియాలో ఇక తిరుగుండదు.