Gautam Gambhir : కివీస్ పై సిరీస్ కోల్పోయిన తర్వాత.. గంభీర్ కు వాస్తవం బోధపడింది.. ఆ విషయంలో పీచే మూడ్!

క్షవరం అయితేనే వివరం తెలుస్తుంది అంటారు పెద్దలు. ఇప్పుడు ఈ సామెత టీం మీడియాకు గౌతమ్ గంభీర్ కు అర్థమయ్యే ఉంటుంది. జట్టును నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతా.. తిరుగులేని స్థాయిలో నిలుపుతానని భీషణ ప్రతిజ్ఞలు చేసిన గంభీర్ కు ఇప్పుడు వాస్తవం బోధపడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 29, 2024 4:10 pm

Gautam Gambhir

Follow us on

Gautam Gambhir : న్యూజిలాండ్ జట్టుతో మూడు టెస్టుల సీరీస్ ను టీమిండియా 2-0 తేడాతో ఇప్పటికే కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన టీమ్ ఇండియా.. పూణే టెస్ట్ లో విజయం సాధిస్తుందని సగటు భారతీయ అభిమాని భావించాడు. టీమిండియా గెలవాలని పూణే మైదానాన్ని స్పిన్ ట్రాక్ గా మార్చారు కూడా. కానీ అంతిమంగా ఫలితం న్యూజిలాండ్ జట్టుకు అనుకూలంగా వచ్చింది. స్వదేశంలో న్యూజిలాండ్ స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. గల్లి స్థాయి క్రికెట్ ఆడి.. పరువు తీసుకున్నారు. పూణే మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగా.. టీమ్ ఇండియా మాత్రం పూర్తిగా తడబడింది. దీంతో న్యూజిలాండ్ జట్టుకు 103 లీడ్ లభించింది. అది రోహిత్ సేన ఓటమిని శాసించింది. న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ తన కెరియర్ లోనే అద్భుతమైన గణాంకలను నమోదు చేశాడు. ఏకంగా 13 వికెట్లను పడగొట్టాడు.

హోరా హోరిగా సాగే అవకాశం..

ఇప్పటికే రెండు టెస్టులనుఓడిపోయినన టీమ్ ఇండియా.. చివరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ముంబై వేదికగా నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే మూడవ టెస్ట్ కు బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా రెడీ అవుతోంది. ఇదే క్రమంలో టీమిండియా గౌతమ్ గంభీర్ పీచే మూడ్ అన్నట్టుగా నిర్ణయం తీసుకున్నాడు. వాంఖడే మైదానాన్ని బ్యాటింగ్ కు అనుకూలంగా రూపొందించాలని క్యూ రేటర్ కు సూచించినట్టు తెలుస్తోంది. మొదటిరోజు బ్యాటింగ్, రెండవ రోజు నుంచి స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే విధంగా మైదానాన్ని తయారు చేయాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పూణే మైదానంలో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడంలో భారతీయ ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. అందువల్లే గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బెంగళూరు టెస్ట్ లోనూ పేస్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో టీమిండి ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లు కేవలం 46 పరుగులకే భారత జట్టు టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. వరుస ఓటములతో టీమిండియా ఇబ్బంది పడుతుండగా.. సిరీస్ ఇప్పటికే గెలిచిన ఆనందంలో న్యూజిలాండ్ ఉంది. తొలిసారిగా భారత జట్టుపై న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గెలిచింది. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.. మరోవైపు చివరి టెస్టులో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని రోహిత్ సేన భావిస్తున్నది. మొత్తంగా చూస్తే మూడవ టెస్ట్ కూడా హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. “మైదానాన్ని పకడ్బందీగా రూపొందిస్తున్నాం. బౌలింగ్, బ్యాటింగ్ కు సమానంగా ఉండేలా మైదానాన్ని రూపొందిస్తున్నాం. వికెట్ పై కొంతమేర గడ్డిని వదిలేసాం. తొలి రోజు మైదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. రెండవ రోజు నుంచి స్పిన్ బౌలర్లకు సహకరిస్తుందని” వాంఖడే స్టేడియం అధికారి వివరించారు.