https://oktelugu.com/

Gautam Gambhir: నవ్వినంత మాత్రాన ఒత్తిడి తగ్గిపోలేదు.. గౌతమ్ గంభీర్ ముందు ఎన్నో చిక్కుముడులు.. ఎలా విప్పుతాడో చూడాలి..

గత ఏడాది టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ కు కొంచెం మోదం.. కొంచెం ఖేదం అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి. దీంతో అతడిని కోచ్ బాధ్యతలనుంచి తప్పించాలని డిమాండ్లు వినిపించాయి. దీనిపై గౌతమ్ గంభీర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 12, 2025 / 01:25 PM IST
    Gautam Gambhir

    Gautam Gambhir

    Follow us on

    Gautam Gambhir: జాతీయ మీడియాలో వినిపించిన వార్తల ప్రకారం గౌతమ్ గంభీర్ కు ఛాంపియన్స్ ట్రోఫీ వరకే గడువు ఇచ్చారని సమాచారం. అయితే టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమి అనేది లేకుండానే విజేతగా నిలిచింది. బలమైన ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే సంచలన బంగ్లాదేశ్ వరకు వరుస విజయాల సాధించి ట్రోఫీని గెలిచింది. 2017 లో ఎదురైన ఓటమికి 2025లో బదులు తీర్చుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంది. టీమిండియా విజయం సాధించిన తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, అయ్యర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి లాంటి ఆటగాళ్లు ఎగిరి గంతేశారు. ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకున్నారు.. అయితే ఈ గెలుపు ద్వారా గౌతమ్ గంభీర్ తన ఒత్తిడిని మర్చిపోయి నవ్వాడు. ప్రశాంతంగా ఉన్నాడు. అయితే నవ్వినంత మాత్రాన గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి తగ్గలేదు. పైగా అతడి ముందు ఇంకా అనేక చిక్కుముడులున్నాయి.

    Also Read: ఐపీఎల్ వేటకు SRH రెడీ.. కొత్త జెర్సీలో ఆటగాళ్లు ఎలా ఉన్నారంటే.

    పొట్టి ఫార్మాట్లో..

    పొట్టి ఫార్మాట్ లో టీమిండియా కు ఎదురు అనేది లేదు. సూర్య ఆధ్వర్యంలో జట్టు అత్యంత బలంగా ఉంది. అభిషేక్ శర్మ అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతడికి గౌతమ్ గంభీర్ మీపరితంగా ప్రోత్సాహం అందిస్తున్నాడు. వరుణ్ చక్రవర్తిని కూడా గౌతమ్ గంభీరే వెలుగులోకి తెచ్చాడు. టి20 లలో బుమ్రా, వరుణ్ చక్రవర్తి గనుక ఎనిమిది ఓవర్ల పాటు బౌలింగ్ వేస్తే… ప్రత్యర్థులకు ఇబ్బంది తప్పదు. ఇక సంజు శాంసన్ మెరుగ బ్యాటింగ్ చేస్తున్నాడు. రిషబ్ పంత్, జైస్వాల్ కూడా అదరగొడుతున్నారు. పవర్ ప్లే లో అర్ష్ దీప్ సింగ్ సత్తా చూపిస్తున్నాడు. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, శివం దూబే ఆల్ రౌండర్ ప్రదర్శన ఇస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఆటగాళ్లతో టి20 జట్టు శత్రు దుర్భేద్యంగా కనిపిస్తోంది. ఇక 2027 వన్డే ప్రపంచ కప్ వరకు తాము రిటైర్ కాబోమని రోహిత్, కోహ్లీ చెప్పేశారు.

    దక్షిణాఫ్రికా, నమిబియా, కెన్యా మైదానంపై 2027 వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ మైదానాలలో స్వల్పస్కోర్లతో మ్యాచ్ లు నెగ్గే అవకాశం ఉండదు. పైగా రోహిత్ దూకుడుగా స్వల్ప ఇన్నింగ్స్ లు ఆడితే టీమిండియా కు లాభం ఉండదు. విరాట్ కోహ్లీ యాంకర్ పాత్రను పోషిస్తే కూడా ప్రయోజనం ఉండదు.. అలాంటప్పుడు గంభీర్ వీరిద్దరి విషయంలో ఎలా ఉంటాడు అనేది చూడాలి. రోహిత్, కోహ్లీ గురించి బోర్డు, సెలెక్టర్ ల నుంచి గంభీర్ క్లారిటీ కోరినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా 27 మ్యాచులు ఆడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు రోహిత్, కోహ్లీ పాత్ర గురించి గంభీర్ స్పష్టత కోరే అవకాశం ఉంది. వన్డే జట్టుకు నాయకత్వం వహించే విషయంలో గిల్, హార్దిక్ మందున్నారు. వారిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటాడనేది గంభీర్ కు ఒకింత కష్టమే.

    ఇక టెస్టులలో రోహిత్ గనుక కొనసాగితే జైస్వాల్, రాహుల్ టాప్ -3 లో కొనసాగితే.. గిల్ ను ఏం చేస్తారనేది చూడాలి.. స్వింగ్, సీమ్ కు ఇంగ్లాండ్ మైదానాలు సహకరిస్తాయి. మరి ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా, షమీ, మహమ్మద్ సిరాజ్ ను గంభీర్ ఎంత మేరకు సిద్ధం చేస్తాడు అనేది చూడాల్సి ఉంది. ఇక టెస్టులలో మిడిల్ ఆర్డర్ అంతగా కుదురుకోలేకపోతోంది. అలాంటప్పుడు అక్కడ కరణ్ నాయర్ ను ఉంచితే సరిపోతుందా.. లేక శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకోవాలా అనేది గంభీర్ కు ఒక రకమైన పరీక్ష.. స్థూలంగా చెప్పాలంటే 2027 వరకు గంభీర్ కు చిక్కుముడులు చాలానే ఉన్నాయి. వీటన్నింటినీ విప్పాలంటే గంభీర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

     

    Also Read:  మీకో దండం రా బాబూ.. ఇండియన్ క్రికెటర్లను ఇలా చేశారేంట్రా?!