https://oktelugu.com/

KKR Vs SRH Final 2024: కేకేఆర్ “ఫైనల్ జట్టు” ఇదే.. గంభీర్ ప్లానింగ్ మామూలుగా లేదు..

ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా, సన్ రైజర్స్ రెండుసార్లు తలపడ్డాయి. రెండిట్లోనూ కోల్ కతా పై చేయి సాధించింది. సన్ రైజర్స్ పై లీగ్ మ్యాచ్ లో నాలుగు పరుగులు, క్వాలిఫైయర్ -1 లో 8 వికెట్ల తేడాతో కోల్ కతా విజయాలు అందుకుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 26, 2024 / 12:48 PM IST

    KKR Vs SRH Final 2024

    Follow us on

    KKR Vs SRH Final 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా కోల్ కతా, హైదరాబాద్ టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. ఆదివారం జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం లక్షల మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఐపీఎల్ లీగ్ దశను కేవలం మూడంటే మూడే ఓటములతో ముగించింది కోల్ కతా. మిగతా జట్లకు సాధ్యం కాని నెట్ రన్ తో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.

    క్వాలిఫైయర్ -1 మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్ వెళ్ళింది. లీగ్ దశలోనూ హైదరాబాద్ జట్టును కోల్ కతా మట్టి కరిపించింది. మరో వైపు హైదరాబాద్ క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో రాజస్థాన్ జట్టుపై గెలుపొందింది. ఫైనల్ దూసుకెళ్లింది. కప్ వేట లో కోల్ కతా తో తలపడనుంది. లీగ్, ప్లే ఆఫ్ లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని హైదరాబాద్ భావిస్తోంది. మరోవైపు ఫైనల్ లోనూ ఓడించి, కప్ దక్కించుకోవాలని కోల్ కతా భావిస్తోంది. అయితే ఇదే దశలో తుది పోరు కోసం కోల్ కతా మెంటార్ గౌతమ్ గంభీర్ అదిరిపోయే ప్రణాళిక రూపొందించాడు. సన్ రైజర్స్ అంచనాలకందకుండా సరికొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాడు.

    ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కతా, సన్ రైజర్స్ రెండుసార్లు తలపడ్డాయి. రెండిట్లోనూ కోల్ కతా పై చేయి సాధించింది. సన్ రైజర్స్ పై లీగ్ మ్యాచ్ లో నాలుగు పరుగులు, క్వాలిఫైయర్ -1 లో 8 వికెట్ల తేడాతో కోల్ కతా విజయాలు అందుకుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్, కోల్ కతా 27 సార్లు తలపడ్డాయి. ఇందులో కోల్ కతా 18సార్లు విజయాలు అందుకుంది. 9సార్లు హైదరాబాద్ గెలుపు సాధించింది.. చెపాక్ వేదికగా క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో రాజస్థాన్ జట్టుపై హైదరాబాద్ విజయాన్ని అందుకుంది.. క్వాలిఫైయర్ -1 లో ఇదే మైదానంపై కోల్ కతా చేతిలో హైదరాబాద్ దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకుంది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే మైదానం పై పూర్తి అవగాహన సాధించిన హైదరాబాద్ ఆటగాళ్లు.. ఆదివారం కోల్ కతా తో జరిగే మ్యాచ్ లోనూ అదే ఆట తీరు ప్రదర్శించాలని భావిస్తున్నారు.

    అయితే కోల్ కతా మెంటార్ గౌతమ్ గంభీర్ హైదరాబాద్ జట్టుకు చెక్ పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాడు.. హైదరాబాద్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మకు కౌంటర్ ఇచ్చే విధంగా.. ఎడమ చేతి వాటం బ్యాటర్లకు అవకాశం ఇవ్వనున్నాడు. కోల్ కతా జట్టులో సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్ ఎడమచేతి వాటం బ్యాటర్లు. వీళ్ళతోపాటు మరో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ నితీష్ రాణా ను కూడా బరిలోకి దించే అవకాశాన్ని గౌతమ్ గంభీర్ పరిశీలనలోకి తీసుకుంటున్నాడు. మందకొడిగా మారిన చెన్నై మైదానం స్పిన్నర్లకు అనుకూలిస్తే.. పిన్ ఉచ్చులో హైదరాబాద్ బ్యాటర్లు చిక్కుకునే విధంగా సుయాస్ శర్మ ను జట్టులోకి తీసుకునే అవకాశాన్ని గౌతమ్ గంభీర్ పరిగణలోకి తీసుకుంటున్నాడు. ఒకవేళ సుయాస్ శర్మ జట్టులోకి వస్తే.. కోల్ కతా 12 ఓవర్ల పాటు స్పిన్ బౌలింగ్ చేయగలదు. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ వంటి వారు భీకరంగా స్పిన్ బౌలింగ్ చేయగలరు. వారిని ఎదుర్కోవాలంటే హైదరాబాద్ ఆటగాళ్లకు ఒక రకంగా సవాలే.