https://oktelugu.com/

Hardik Pandya Divorce: విడాకుల వదంతులు.. మరో వ్యక్తితో హార్దిక్ భార్య.. వైరల్ వీడియో

నటాషా ఓ విదేశీ మోడల్. ఓ పార్టీలో హార్దిక్ పాండ్యాకు పరిచయం అయింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. వారిద్దరూ నాలుగేళ్లపాటు సహజీవనం చేసిన తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 26, 2024 / 12:53 PM IST

    Hardik Pandya Divorce

    Follow us on

    Hardik Pandya Divorce: టీమిండియా టి20 వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ షెడ్యూల్ కెప్టెన్ హార్థిక్ పాండ్యా.. ఆయన సతీమణి నటాషాకు విడాకులు ఇచ్చాడని వదంతులు వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూర్చే విధంగా వారిద్దరూ తమ సామాజిక మాధ్యమ ఖాతాలలో ఒకరిని ఒకరు అన్ ఫ్రెండ్ చేసుకున్నారు. అంతేకాదు గతంలో వారు కలిసి ఉన్న ఫొటోలను డిలీట్ చేసుకున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. హార్దిక్ పాండ్యా నటాషాకు 70% వరకు భరణం చెల్లించాడని తెలుస్తోంది. కొడుకు బాధ్యతను కూడా ఆమె చూసుకునేలాగా ఒప్పందాలు కుదిరాయని ప్రచారం జరుగుతోంది.. అయితే ఈ విడాకుల వార్తలపై ఇంతవరకు అటు నటాషా, ఇటు హార్దిక్ పాండ్యా నోరు విప్పలేదు. కనీసం మాట కూడా మాట్లాడలేదు.

    ఇక విడాకుల ఆరోపణలు ఇలా ఉండగానే.. హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా ముంబైలో కనిపించారు.. తన ఫిట్ నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ తో కలిసి రోడ్డుపై కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హార్దిక్ పాండ్యా తో విడాకులు తీసుకున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. నటాషా తన ఫిట్ నెస్ ట్రైనర్ తో కనిపించడం సంచలనంగా మారింది.. హార్దిక్ పాండ్యాతో విడాకులు అనంతరం నటాషా అలెగ్జాండర్ తో కలిసి సహజీవనం సాగిస్తోందనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి. ఆ పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలోనే.. ఆమె అలెగ్జాండర్ తో కనిపించడం చర్చకు దారి తీస్తోంది.

    నటాషా ఓ విదేశీ మోడల్. ఓ పార్టీలో హార్దిక్ పాండ్యాకు పరిచయం అయింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. వారిద్దరూ నాలుగేళ్లపాటు సహజీవనం చేసిన తర్వాత ఓ బాబుకు జన్మనిచ్చారు. పెళ్లికి ముందే నటాషా గర్భవతి అయింది. ఆ తర్వాత ఆ బాబుకు జన్మనిచ్చింది. బాబుకు జన్మనిచ్చిన అనంతరం హార్దిక్ పాండ్యా నటాషాను వివాహం చేసుకున్నాడు. వివాహమైన తొలి రోజుల్లో వీరు బాగానే ఉన్నారు.. 2022 సీజన్లో గుజరాత్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచినప్పుడు.. గాడ ఆలింగనంతో హార్దిక్ పాండ్యాను నటాషా అభినందించింది. అప్పట్లో ఈ వీడియో సంచలనంగా మారింది.

    హార్దిక్ ను పెళ్లి చేసుకున్న తర్వాత నటాషా తన మోడల్ రంగానికి గుడ్ బై చెప్పింది. పూర్తిగా హార్దిక్ కు సంబంధించిన వ్యవహారాలను పరిశీలించేది. అతడు ఆడే మ్యాచ్ లకు హాజరయ్యేది. కానీ ఇటీవల అతడు ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ అయినప్పుడు.. పెద్దగా స్పందించలేదు. అతడు ఆడే మ్యాచ్ లకు హాజరు కాలేదు. దీనిపై అప్పట్లో ఆరోపణలు వినిపించినప్పటికీ పుకార్లే అని అందరూ అనుకున్నారు. కానీ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫ్రెండ్ చేసుకోవడం, బయట పెద్దగా కనిపించకపోవడంతో విడాకులు తీసుకున్నారని అందరూ ఒక అంచనాకొచ్చారు. ఈ తరుణంలోనే హార్దిక్ పాండ్యా తన ఆస్తిలో 70% నటాషాకు భరణంగా చెల్లించాడని తెలుస్తోంది. ఇలా ఉండగానే నటాషా అలెగ్జాండర్ తో కనిపించడం విశేషం.