https://oktelugu.com/

Shikhar Dhawan’s Birthday : దూకుడైన క్రికెటర్ మాత్రమే కాదు.. మంచి ఎంటర్ టైనర్ కూడా.. సంసారమే చెడిందిలా!

టీమిండియాలో గబ్బర్ గా పేరుపొందిన ఆటగాడు శిఖర్ ధావన్. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ తో అద్భుతమైన ఇన్నింగ్స్ నిర్మించి.. టీమిండియా కు చిరస్మరణీయ విజయాలు అందించాడు. దూకుడైన ఆట తీరుకు పర్యాయపదంగా నిలిచాడు. ఆట తీరు మాత్రమే కాకుండా.. తోటి ఆటగాళ్లతో సరదాగా ఉంటూ మైదానంలో నవ్వులు పూయించేవాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 5, 2024 / 12:53 PM IST

    Shikhar Dhawan Funny moments

    Follow us on

    Shikhar Dhawan’s Birthday :  శిఖర్ ధావన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. టీమిండియా కు గుడ్ బై చెప్పిన తర్వాత అతడు తన సరికొత్త అవతారాన్ని అభిమానులకు పరిచయం చేస్తున్నాడు. రీల్స్ చేస్తూ ఆనందాన్ని పంచుతున్నాడు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి విశేషాలను పంచుకుంటూ.. ప్రాంతానికి చెందిన విశిష్టమైన వ్యక్తులను అనుసరిస్తున్నాడు. అనుకరిస్తున్నాడు. వాటికి సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. ధావన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫన్నీ మూమెంట్స్ ను ఒకసారి పరిశీలిస్తే..

    ఫ్యాన్ వాలా బాబా

    శిఖర్ ధావన్ ఇటీవల కర్ణాటక వెళ్లాడు. అక్కడ “ఫ్యాన్ వాలే బాబా” గా ప్రాచుర్యం పొందిన లడ్డు ముఖ్య బాబాను అనుకరించాడు. కుర్చీపై కూర్చుని ఫ్యాన్వాలా బాబా లాగా ప్రవర్తించాడు.

    గేల్ తో కలిసి..

    ఇక మరో వీడియోలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ తో కలిసి ధావన్ కాలు కలిపాడు. అభిమానులను నవ్వించే విధంగా స్టెప్పులు వేశాడు. గేల్ కూడా ధావన్ ను ఉత్సాహపరుస్తూ.. అద్భుతంగా డ్యాన్స్ వేశాడు.. ఆ సమయంలో ధావన్ గేల్ ను ఉద్దేశించి” దేశీ ముండా తే జమైకన్ స్టాల్ డా కాంబో” అని వ్యాఖ్యానించాడు.

    యువరాజ్ సింగ్ తో..

    యువరాజ్ సింగ్ తో శిఖర్ ధావన్ అనేక సందర్భాల్లో సందడి చేశాడు ఏం ఒక వీడియోలో యువరాజ్ సింగ్ ఒడిలో శిఖర్ ధావన్ పడుకున్నాడు. ఈ సమయంలో శిఖర్ తలపై చేతులు ఉంచిన యువరాజ్ ” చిన్ తపక్ దమ్ దమ్” అంటూ చిన్న లైన్ పాడాడు.

    జానీ లివర్ తో..

    బాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ జానీ లీవర్ తో కలిసి ధావన్ సందడి చేశాడు. జానీ లివర్ తో చలోక్తులు విసురుతూ ఆకట్టుకున్నాడు. ఓటీటీ ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టాడు. అంతేకాదు “ఐసా దీపావళికా హోలీ సర్ప్రైజ్ సిర్ఫ్ మై హాయ్ దే సక్తా హూ భూ లా ఆ ఆ ఆ ఆ” తనపై తానే కామెంట్ చేసుకొని అభిమానులను ఆశ్చర్యపరిచాడు.

    ఇలా చెప్పుకుంటూ పోతే శిఖర్ ధావన్ జీవితంలో ఎన్నో వినోదభరితమైన సంఘటనలు ఉన్నాయి. ఇద్దరి పిల్లల తల్లిని పెళ్లి చేసుకోవడం.. ఆమెతో సంసార జీవనం సాగించడం.. చివరికి ఒక కుమారుడిని కన్నడం.. ఆ తర్వాత విడిపోవడం.. కొద్దిరోజులు మానసిక సమస్యలతో బాధపడడం.. అనంతరం మైదానంలోకి ఎంట్రీ ఇవ్వడం.. ఇలా ఏ సంఘటన చూసుకున్నా ధవన్ వ్యక్తిగత జీవితంలో ఎత్తులు కనిపిస్తాయి, అదే సమయంలో పల్లాలూ దర్శనమిస్తాయి.