https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : డబుల్ ఎలిమినేషన్ లో షాకింగ్ ట్విస్ట్ ఇవ్వనున్న బిగ్ బాస్..స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి అన్యాయం చేయబోతున్నారా?

ఈ వారం మాత్రం గౌతమ్, నిఖిల్ మధ్య జరిగిన పెద్ద గొడవలో గౌతమ్ వైపు తప్పు ఉండడం తో నిఖిల్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. దానికి తోడు గౌతమ్ కి మంచి ఎపిసోడ్స్ కూడా పడకపోవడం వల్ల గ్రాఫ్ కాస్త పడిపోయింది. దీంతో మొదటి స్థానంలో నిఖిల్, రెండవ స్థానం లో గౌతమ్ ఉన్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 5, 2024 / 12:51 PM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 :  ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు ఒక్క అవినాష్ తప్ప హౌస్ మేట్స్ అందరూ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వీరిలో గౌతమ్, నిఖిల్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోటీ నడుస్తుంది. టాప్ 2 వీళ్లిద్దరి ఉన్నారు. గత వారం గౌతమ్ దాదాపుగా అన్ని పోల్స్ లో నిఖిల్ మీద భారీ మార్జిన్ తో లీడింగ్ లో ఉండేవాడు. కానీ ఈ వారం మాత్రం గౌతమ్, నిఖిల్ మధ్య జరిగిన పెద్ద గొడవలో గౌతమ్ వైపు తప్పు ఉండడం తో నిఖిల్ గ్రాఫ్ ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిపోయింది. దానికి తోడు గౌతమ్ కి మంచి ఎపిసోడ్స్ కూడా పడకపోవడం వల్ల గ్రాఫ్ కాస్త పడిపోయింది. దీంతో మొదటి స్థానంలో నిఖిల్, రెండవ స్థానం లో గౌతమ్ ఉన్నారు. అయితే నేడు గౌతమ్ కి బీభత్సమైన ఎపిసోడ్ పడబోతోంది, ఈ ఎపిసోడ్ ఆయన గ్రాఫ్ ని అమాంతం పెంచేయొచ్చు.

    ఇక మూడవ స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ఈ వారం ఈమెకి మంచి ఎపిసోడ్స్ పడ్డాయి. మొదటి రెండు టాస్కులు గెలిచి, ఓటుని అప్పీల్ చేసుకునే అవకాశం ఈమెకి మాత్రమే కలిగింది. నిన్నటి ఎపిసోడ్ లో కూడా ఈమె ఒక టాస్కులో గెలుస్తుంది. ఇలా ఈ వారం ఇప్పటి వరకు నాలుగు టాస్కులు జరిగితే మూడిట్లో ప్రేరణ నే గెలిచింది. దానికి ఆమె ఆడియన్స్ ని ఓటు అప్పీల్ చేసుకునే తీరు చాలా నిజాయితీగా, క్యూట్ గా అనిపించింది. కాబట్టి ఈమెకు ఓటింగ్ భారీ రేంజ్ లోనే పడింది. ఇక నాల్గవ స్థానంలో రోహిణి కొనసాగుతుంది. రోహిణి కి కూడా దాదాపుగా ప్రేరణతో సమానమైన ఓటింగ్ పడుతుంది. నిన్న జరిగిన టాస్కుల్లో కూడా రోహిణి తన సత్తా చాటింది. ఇలా గడిచిన కొన్ని ఎపిసోడ్స్ నుండి రోహిణి మాస్ మామూలు రేంజ్ లో లేదు.

    కాకపోతే ఆమెలో ఉన్న మైనస్ ఏమిటంటే మొదటి నుండి నామినేషన్స్ లో ఉండుంటే, నేడు కచ్చితంగా ఆమె టాప్ 3 రేంజ్ లో ఉండేది. అంతే కాదు టైటిల్ రేస్ లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. రోహిణి లో ఆ రేంజ్ క్యాలిబర్ ఉంది. ఇక చివరి రెండు స్థానాల్లో నబీల్, విష్ణుప్రియ ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళిద్దరిలో నబీల్ ని ఎలిమినేట్ చేసే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే నబీల్ నుండి కంటెంట్ రావడం బాగా తగ్గిపోయిందట. అంతే కాకుండా అతనికంటే విష్ణు ప్రియ తో స్టార్ మా ఛానల్ లో ఎక్కువ షోస్ చేసే అవకాశం ఉండడం, బోలెడంత కంటెంట్ కి స్కోప్ ఉండడం తో విష్ణు ప్రియ ని ఫినాలే కి పంపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఇద్దరిలో ఎవరు ఫినాలే కి వెళ్ళబోతున్నారు అనేది. ఒకవేళ నబీల్ ని ఎలిమినేట్ చేస్తే మాత్రం అన్యాయం అనే చెప్పాలి. డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎలిమినేట్ అవ్వొచ్చు.