IPL-2023 : ఐపీఎల్‌లో లీగ్ పోటీలు రసవత్తరంగా ముగిశాయి. టాప్‌ఫోర్ స్థానాలు.. ఆరు జట్ల మధ్య చివరి వరకు దోబూచులాడాయి. చివరకు గుజరాత్, లక్నో, చెన్నై, ముంబై జట్లు ప్లే ఆఫ్‌కు చేరాయి. రాజస్థాన్, బెంగళూరు కూడా ప్లేఫ్ కోసం గట్టి పోటీ ఇచ్చాయి. కానీ లీగ్ దశలో ఫస్ట్ ఆఫ్‌లో టాప్‌లో ఉన్న రాజస్థాన్ సెకండాఫ్‌లో చతికిలపడింది. బెంగళూరు కూడా ఫస్ట్‌ఆఫ్‌తో పోల్చితే సెకండాఫ్‌లో బెటర్‌గా డినా.. ప్లేఫ్‌కు చేరుకోలేకపోయింది. ఇక గుజరాత్, లక్నో గత ఐపీఎల్‌లో కూడా టాప్ 2 పొజిషన్‌లో ఉన్నాయి. ఇక ఈసారి విషేశం ఏమిటంటా గత సీజన్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై, ముంబై జట్లు ఈసారి ప్లేఫ్‌కు చేరడం. పడిలేనిన కెరటాల్లా.. చెన్నై ఈసారి మొదటి నుంచి అద్భుతమైన ఆటతో ప్లేఫ్‌కు దూసుకువచ్చింది. ఇక ముంబై ఫస్ట్ ఆఫ్‌లో పేలవ ఆటతీరుతో చతికిలపడింది. కానీ సెకండాఫ్‌లో ఆ జట్టు అద్భుతమైన ఆటతీరుతో వరుస విజయాలు సాధించి ప్లేఫ్‌కు దూసుకువచ్చింది. ఆయితే ఆ జట్లు ప్లేఆఫ్‌కు రావడం వెనుక కృషి, పట్టుదల, ఆటగాళ్ల ఫాం, బ్యాట్స్‌మెన్స్, బౌలర్ల ప్రతిభతోపాటు సారథుల కృషి కచ్చితంగా ఉంది.
కీలక ఆటగాళ్లు లేకపోయినా..
ముంబై, చెన్నై జట్లుతో ఈసారి కీలక ఆటగాలు గాయాల కారణంగా తప్పుకున్నారు. అయినా జట్లు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చెన్నైలో బెన్ స్టోక్స్ అందుబాటులో లేడు. ఆజట్టు యాజమాన్యం స్టోక్స్ భారీ ఆశలు పెట్టుకుని భారీగా డబ్బులు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్‌లో మాత్రం అందుబాటులో లేడు. ఇక బుంబైకి జోఫర్ ఆర్చర్, కీలక బౌలర్ బూమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయినా లీగ్ దశలో సమష్టిగా రాణించాయి. ఫస్ట్ ఆఫ్‌లో కాస్త తడబడినా సెకండాఫ్‌లో కీలక ఆటగాళ్లు ఫామ్‌లోకి రావడం ఆ జట్లకు కలిసి వచ్చింది. ప్లే ఆఫ్‌కు తీసుకెళ్లింది.
కెప్టెన్ల సమయస్ఫూర్తి..
చెన్నై, ముంబై కెప్టెన్ల సమయ స్ఫూర్తి, ఆటగాళ్లపై వారికి ఉన్న నమ్మకం కూడా జట్లు సమష్టిగాణించడంలో దోహదపడ్డాయి. ముంబై ఆటగాడు తిలక్‌వర్మ గతేడాది పెద్దగా ఆడలేదు. కెప్టెన్ రోహిత్ మాత్రం నమ్మకంతో జట్టులోకి తీసుకున్నాడు. ఈ సీజన్‌లో తిలక్‌వర్మ దుమ్మ రేపుతున్నాడు. పీయూష్ చావ్లా సీనియర్ ఆటగాడు. రాణిస్తాడని ఎవరూ ఊహించలేదు. జట్టు యాజమాన్యానికి కూడా పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు కానీ అద్భుంతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ డైమన్ డార్ఫ్ కూడా జట్టులో కీలకంగా మారాడు. వారిపై కెప్టెన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాణిస్తున్నారు. ఇక, చెనై్నలో అయితే రెహానా దుమ్మురేపుతున్నాడు. టెస్ట్ ప్లేయర్‌గా ముద్ర ఉన్న రెహానా.. టీ20ల్లో ఆటతీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కెప్టెన్ ధోనీ పెట్టకున్న నమ్మకాన్ని రెహానే నిలబెడుతున్నాడు.
జట్టును మార్చకుండానే..
ఈ ఐపీఎల్‌లో చెన్నై జట్టు మరో రికార్డు సృష్టించింది. 14 లీగ్ మ్యాచ్‌లలో 8 మ్యాచ్‌లు ఒక్క ఆటగాడిని కూడా మార్చకుండా ఆడింది. ఇది ఆ జట్టు కల్చర్, టీం స్పిరిట్, ప్లేయర్స్‌పై జట్టు యాజమాన్యం, కెప్టెన్‌కు ఉన్న నమ్మకానికి నిదర్శనం. ఏ ప్లేయర్ ఎలాంటి రోల్ పోషిస్తాడు అన్నది స్పష్టత ఉండడంతో రికార్డుస్థాయిలో 8 మ్యాచ్‌లు జట్టులో ఒక్క ఆటగాడిని కూడా మార్చలేదు. తద్వారా ఆటగాళ్లు బెస్ట్ అయ్యారు. ఒక మ్యాచ్‌లో పతేరాణా 50 పరుగులు ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోది. అయినా ధోనీ నిందించలేదు. బాగా ఆడాడని ఎంకరేజ్ చేశాడు.
ఫామ్‌లోకి వచ్చిన కీలక ఆటగాళ్లు..
ఇక ఈ సీజన్‌లో కీలక ఆటగాళ్లు ఫస్ట్ ఆఫ్‌లో విఫలమయ్యారు. సెకండ్ ఆఫ్‌కు వచ్చేసరికి బాగా పుంజుకున్నారు. ముఖ్యంగా ముంబైకి చెందిన ఇషాన్‌కిషన్, సూర్యకుమార్, రోహిత్‌శర్మ ఫాంలోకి వచ్చారు. ఫాం కోల్పోయిన వారు కూడా పలురుగ వరద పారిస్తున్నారు. ముంబై బ్యాటింగ్‌లో క్లిక్ అవ్వగా చెన్నై బ్యాటింగ్, బౌలింగ్‌లో క్లిక్ అయింది. ముంబై బౌలింగ్ కూడా మొదటి ఆఫ్ మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగైంది. పీయూష్‌చావ్లా, డైమన్ డార్ఫ్ రాణిస్తున్నారు. అంటర్ రేటెడ్ ఆటగాళ్లే అయినా అద్భుంత చేస్తున్నారు.
కెప్టెన్లు ఇచ్ని ధైన్యం, ఆటగాళ్లపై విశ్వాసం, ప్లానింగ్, టీం కల్చర్, ఆటగాళ్ల ఎంపిక మొత్తం అన్నీ కలిసి గతేడాది అట్టడుగున్న నిలిచిన చెన్నై, ముంబైని ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌కు తీసుకెళ్లాయి.