RR Vs RCB: గెలిచేది ఆ జట్టే.. చెప్పేసిన మాజీ క్రికెటర్

రాజస్థాన్, బెంగళూరు జట్లు మూడు, నాలుగు స్థానాలలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ 14 మ్యాచ్లు ఆడగా.. 8 విజయాలు నమోదు చేసుకుంది. ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది.. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. 17 పాయింట్లు, 0.273 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 4:35 pm

RR Vs RCB

Follow us on

RR Vs RCB: ఐపీఎల్ లీగ్ సమరం ముగిసింది..ప్లే ఆఫ్ కు రంగం సిద్ధమైంది.. మే 21న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. పాయింట్ల పట్టికలో ఈ రెండు జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.. కోల్ కతా లీగ్ దశలో 14 మ్యాచులు ఆడింది.. ఇందులో 9 విజయాలు సాధించింది. మూడు మ్యాచ్లలో ఓడిపోయింది. రెండు మ్యాచులు రద్దయ్యాయి. 20 పాయింట్లతో ఈ జట్టు పాయింట్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. నెట్ రన్ రేట్ కూడా 1.428 గా ఉంది. హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్లలో 8 విజయాలను నమోదు చేసింది. ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. 17 పాయింట్లు, 0.414 నెట్ రన్ రేట్ కలిగి ఉంది.

ఇక రాజస్థాన్, బెంగళూరు జట్లు మూడు, నాలుగు స్థానాలలో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ 14 మ్యాచ్లు ఆడగా.. 8 విజయాలు నమోదు చేసుకుంది. ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది.. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది.. 17 పాయింట్లు, 0.273 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. ఇక బెంగళూరు 14 మ్యాచులు ఆడగా.. ఏడు విజయాలు, ఏడు అపజయాలతో నాలుగవ స్థానంలో నిలిచింది. 14 పాయింట్లు 0.459 నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. బెంగళూరు, రాజస్థాన్ జట్లు మే 22న అహ్మదాబాద్ లో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి.

అయితే ఈ రెండు జట్లలో బెంగళూరుకే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానల్ లో ఇందుకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడించాడు. ” ఐపీఎల్ లో ప్రతిదీ కూడా బెంగళూరు జట్టుకు అనుకూలంగా జరుగుతోంది. ఈ జట్టు చివర్లో వరుసగా 6 మ్యాచులు గెలిచి ప్లే ఆఫ్ కు వచ్చేసింది. అదే రాజస్థాన్ జట్టు మొదట్లో 9 మ్యాచ్లు ఆడి.. 8 గెలిచింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది. ఈ ప్రకారం చూసుకుంటే బెంగళూరుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బెంగళూరు జట్టు అన్ని రంగాలలో ఆరి తేరి కనిపిస్తోంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా దీనిని బలపరుస్తున్నాయి. లీగ్ దశలో మూడు, నాలుగు స్థానాలలో నిలిచిన జట్లు చారిత్రాత్మక సవాల్ ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే ఈ ధైర్యం బెంగళూరులో ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి ఆ జట్టు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని” ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. మరి కొద్ది రోజుల్లో ప్లే ఆఫ్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. దానికి ముందు ఆకాశ్ చోప్రా చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి.