https://oktelugu.com/

Ravi Shastri: మా తిండి గురించి చెప్పాల్సి వస్తే.. పందులు కూడా పనికిరావు.. రవి శాస్త్రి

ఆటగాడిగా, వ్యాఖ్యాతగా, శిక్షకుడిగా.. టీమిండియాలో రవి శాస్త్రి పాత్ర బహుముఖమైనది. అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి మాటలైనా మొహమాటం లేకుండా అనేస్తుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 / 07:04 PM IST

    Ravi Shastri

    Follow us on

    Ravi Shastri: స్టార్ ఆటగాళ్లపై తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెబుతుంటారు. రవి శాస్త్రి కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటంలో దిట్ట. అందువల్లే ఎలాంటి వేదికలోనైనా సరే మొహమాటం లేకుండా ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. ఈ క్రమంలో తను మాట్లాడుతూ.. తను క్రికెట్ ఆడే రోజులలో.. తోటి ఆటగాళ్లు, తాను విపరీతంగా తినే వాళ్ళమని.. ఆ సమయంలో పందులు కూడా సాటి రావని రవి శాస్త్రి వ్యాఖ్యానించారు. ఆ మాటలకు చుట్టుపక్కల ఉన్న వాళ్లు గట్టిగా నవ్వారు. టీమిండియా మాజీ ఆటగాడు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సందీప్ పాటిల్ పేరుమీద బియాండ్ బౌండరీస్ అనే పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు.. అయితే ఆ కార్యక్రమానికి రవి శాస్త్రి హాజరయ్యారు. ఆ పుస్తకంలో ఒక సందర్భాన్ని వ్యాఖ్యాత ప్రశ్నించారు.. అందులో ఆహారానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. దానికి రవి శాస్త్రి స్పందించారు.. తనదైన శైలిలో సమాధానం చెప్పారు..” ఈ జనరేషన్లో టెస్ట్ ఆడియో క్రికెటర్లు ఏ స్థాయిలో సంపాదిస్తున్నారో.. ఆరోజుల్లో నేను, సందీప్ అంతకంటే ఎక్కువగానే వెనకేసుకున్నాం. అయితే మేము డబ్బులను ఇంటికి తీసుకు వెళ్లే వాళ్ళం కాదు. టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు డబ్బుల గురించి మా నాన్న అడిగేవారు. ఆ సమయంలో నా దగ్గర చిల్లర మాత్రమే ఉండేది. ఎందుకంటే మేము విపరీతంగా తినేవాళ్ళం. ఆ సమయంలో పందులు కూడా సాటి వచ్చేవి కావు. మా తిండిని చూసి సర్వర్ ఆశ్చర్యానికి గురయ్యేవాడు. అతడిని చూసి మేము పెద్దగా స్పందించే వాళ్ళం కాదని” రవి శాస్త్రి వ్యాఖ్యలు ఇచ్చారు.

    తాగుడు గురించి ఏమన్నారంటే..

    ఇక అదే పుస్తకంలో తాగుడు గురించి ప్రస్తావన ఉంది. ఆ విషయాన్ని ప్యానలిస్ట్ రవి శాస్త్రిని ప్రశ్నించాడు. దానికి కూడా అతడు ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు..” మేము వయసులో ఉన్నప్పుడు ఆతృతగా ఉండేవాళ్ళం. ఆ సమయంలో మాకు దాహం ఎక్కువగా ఉండేది. టెస్ట్ మ్యాచ్ సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ముగిసేది. ఒక గంట తర్వాత మా సురా పానం మొదలయ్యేది. ఆ తర్వాత అది ఎక్కడిదాకా వెళ్లేదో తెలిసేది కాదని” రవి శాస్త్రి వివరించాడు. అయితే సందీప్ పాటిల్ పుస్తక ఆవిష్కరణ ముగిసిన తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి స్పందించాడు. ఆస్ట్రేలియాపై టీమిండియా మెరుగైన ఆట తీరు ప్రదర్శిస్తుందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ జట్టు చేతిలో ఓడిపోవడం టీమిండియా కు గర్లభంగం కలిగించిందన్నారు. కొన్ని సంవత్సరాలుగా టీమిండియా నిలకడగా రాణిస్తోందని.. న్యూజిలాండ్ స్థితిలో ఓటమి పీడ కల లాంటిదని సందీప్ వ్యాఖ్యానించాడు. కాగా, నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియా తో భారత్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడుతుంది.