Prabhas: సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి తర్వాత మన టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో స్థానాన్ని భర్తీ చేయడానికి చాలా సమయమే పట్టింది. రాజమౌళి సినిమాల రికార్డ్స్ ని రాజమౌళినే బద్దలు కొడుతుండడంతో, ఈ జనరేషన్ లో నెంబర్ 1 హీరో ఎవ్వరూ లేరు, కేవలం రాజమౌళి మాత్రమే నెంబర్ 1 అని చెప్పేవారు విశ్లేషకులు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రభాస్ తన సత్తా చాటాడు. బాహుబలి సిరీస్ తర్వాత ఈయన 5 సినిమాలు చేస్తే అందులో మూడు ఫ్లాప్స్, రెండు హిట్స్ ఉన్నాయి. రాధే శ్యామ్ మినహా, మిగిలిన రెండు ఫ్లాప్ సినిమాలు, ప్రభాస్ తోటి స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలకంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడాన్ని చూసి ట్రేడ్ పండితులు ఆశ్చర్యపోయారు. ఫ్లాప్స్ వస్తేనే ఇలా ఉంది, ఇక హిట్లు కొడితే ప్రభాస్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలా ఉంటుందో అని అంచనాలు వేసుకునేవారు. ఆ సమయంలోనే ‘సలార్’, ‘కల్కి’ చిత్రాలు విడుదలయ్యాయి.
‘సలార్’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, కల్కి చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీటిని ఇప్పుడు ఉన్నటువంటి స్టార్ హీరోలు అందుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇదంతా పక్కన పెడితే భవిష్యత్తులో ప్రభాస్ చేయబోయే సినిమాలను చూసి ఇతర హీరోల అభిమానులు కుళ్ళుకుంటున్నారు. సందీప్ వంగ తో ‘స్పిరిట్’ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభించబోతున్నారు, అదే విధంగా ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వీటితో పాటు హను రాఘవపూడి తో ఒక సినిమాని ఈమధ్యనే ప్రారంభించాడు. డైరెక్టర్ మారుతీ తో ప్రస్తుతం చేస్తున్న ‘రాజా సాబ్’ చిత్రం మీద కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈయన కేజీఎఫ్, సలార్ మేకర్స్ ‘హోమబుల్ ఫిల్మ్స్’ తో మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేసాడు. ఈ మూడు సినిమాలకు గానూ ఆయన 600 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నట్టు సమాచారం. అంటే ఒక్కో సినిమాకి 200 కోట్ల రూపాయిలు అన్నమాట. రజినీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి సూపర్ స్టార్స్ రెమ్యూనరేషన్స్ ఇంకా 150 కోట్లు కూడా దాటలేదు. అలాంటిది ప్రభాస్ ఏకంగా 200 కోట్ల రూపాయిలు రెమ్యూనరేషన్ అందుకునే రేంజ్ కి వెళ్లాడంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు సినిమాల్లో ఒకటి సలార్ 2 . ఇక ఆ తర్వాత లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తో మరో సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఆ కాంబినేషన్స్ చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది కదూ, ఒక దశాబ్దం పాటు ఇండియా లోనే నెంబర్ 1 హీరోగా కొనసాగేందుకు ప్రభాస్ రూట్ మ్యాప్ వేసేసుకున్నాడు.