https://oktelugu.com/

Team India Bowling: ఇండియా బౌలర్లను చూసి వణికిపోతున్న విదేశీ బ్యాట్స్ మెన్స్…

మన బౌలర్లు స్పిన్ కి అనుకూలించే పిచ్ అయితే జడేజా, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్ దిగ్గజాలు వికెట్లు తీస్తున్నారు.పిచ్ పేస్ కి అనుకూలించేది అయితే పేస్ బౌలర్లు అయినా బుమ్రా,సిరాజ్ లు వరుసగా వికెట్లు తీస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 21, 2023 / 01:10 PM IST

    Team India Bowling

    Follow us on

    Team India Bowling: ప్రస్తుతం ఇండియన్ టీం ప్రపంచం లోనే అత్యంత శక్తివంతమైన టీం గా ఎదిగింది.ఎందుకంటే మొన్నటి వరకు మన టీం బౌలింగ్ విషయం లో చాలా ఇబ్బందులను ఎదురుకుంటు వచ్చింది. ముఖ్యంగా ప్రతి మ్యాచ్ లో కూడా బౌలర్లు ఫెయిల్ అవ్వడం వల్లే మనం అప్పట్లో చాలా మ్యాచ్ లు ఓడిపోతూ వచ్చాం కానీ ఇప్పుడు రోజులు మారాయి ఇండియా ప్రపంచం లోనే అత్యుత్తమైన బౌలింగ్ టీం గా మారింది అని సీనియర్ ప్లేయర్లు సైతం వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఏషియా కప్ ఒక్కటి గెలిచినందుకే మన ఇండియా బౌలింగ్ లో నెంబర్ వన్ టీం అయిందా అని మీకు అనిపించవచ్చు.

    కానీ నిజంగానే ఇండియా బౌలింగ్ లో నెంబర్ వన్ టీం అయింది ఎలా అంటే ప్రపంచం లోనే టాప్ టీం లు అయినా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్,న్యూజిలాండ్ లాంటి టీం లు కూడా అటు స్పిన్, ఇటు ఫాస్ట్ బౌలింగ్ లో అంత పర్ఫెక్ట్ గా లేవు దాదాపు గా ఈ అన్ని టీం లు కూడా పేస్ బౌలింగ్ లో మాత్రమే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.రీసెంట్ గా పాకిస్థాన్ టీం ని కనక మనం చూసుకుంటూ ప్రపంచ నెంబర్ వన్ అని చెప్పుకుంటూ తిరుగుతుంది కానీ వాళ్ళ దగ్గర కూడా అంత మంచి బౌలింగ్ లేదనే చెప్పాలి.ఎందుకంటే వాళ్ళ బౌలర్లు అందరు కూడా పేస్ మాత్రమే బాగా వేస్తారు స్పిన్ విభాగంలో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది మొన్న జరిగిన మ్యాచ్ లో క్లియర్ గా తెలిసిపోయింది.కానీ మన బౌలర్లు మాత్రం అటు స్పిన్ బౌలింగ్ లోను, ఇటు పేస్ బౌలింగ్ లోను చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు.అనేది గత మ్యాచ్ లను చూసుకుంటే తెలుస్తుంది…

    ఇక మన బౌలర్లు స్పిన్ కి అనుకూలించే పిచ్ అయితే జడేజా, కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్ దిగ్గజాలు వికెట్లు తీస్తున్నారు.పిచ్ పేస్ కి అనుకూలించేది అయితే పేస్ బౌలర్లు అయినా బుమ్రా,సిరాజ్ లు వరుసగా వికెట్లు తీస్తున్నారు.ఇక వీళ్ళకి తోడు గా హార్దిక్ పాండ్య శార్దూల్ ఠాకూర్ లాంటి బౌలర్లు కూడా ఉన్నారు. చివరి 20 మ్యాచ్ లను కనక చూసుకున్నటైతే అందులో ఇండియా 14 మ్యాచుల్లో గెలిచింది,6 మ్యాచుల్లో ఓడిపోయింది.ఈ మ్యాచుల్లో కూడా ఇండియన్ బౌలర్లు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. గెలిచినా మ్యాచుల్లో ఎలాగైతే చాలా బాగా బౌలింగ్ చేసారో, ఓడిన మ్యాచుల్లో కూడా అలానే బౌలింగ్ చేసారు.కానీ ఈ మ్యాచులు ఓడిపోవడానికి మన బ్యాట్స్ మెన్స్ ఫెయిల్ అవ్వడమే ముఖ్య కారణం…ఇక ఇప్పటికే ఆస్ట్రేలియా లాంటి టీం కూడా ఇండియన్ బౌలర్లను చూసి మనల్ని ఓడించడం కష్టం అనే ఒక చిన్నపాటి ఆందోళనలో ఉన్నట్టు గా తెలుస్తుంది…ఇకమీదట నుంచి ఇండియన్ బౌలర్లు కూడా ఎవ్వరికి తక్కువ కాదు అని ప్రూవ్ చేసిన మన బౌలర్లు నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…