https://oktelugu.com/

Canada Politics : కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయి?

జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిలబడడానికి కెనడాలో సిక్కులు కీలకం. అధికారం కోసం ట్రూడో సిక్కుల కు అండగా ఉంటూ భారత్ పై విషం చిమ్ముతున్నారు. ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 21, 2023 / 01:17 PM IST

    Canada Politics : రాజకీయాల్లో అధికారం కోసం ఎవరైనా ఏమైనా చేస్తారు. ఏ దేశంలోనైనా ఇదే పరిస్థితి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కెనడా.. 170 సీట్లు వస్తే కెనడాలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. 2021లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాడు ప్రస్తుత అధ్యక్షుడు ట్రూడో. అయితే సరిపడా మెజార్టీ (156) రాకపోవడంతో 25 సీట్లు వచ్చిన ఒక ప్రాంతీయ పార్టీ ‘న్యూ డెమోక్రటిక్ పార్టీ’తో జస్టిన్ ట్రూడో పొత్తుతో అధికారంలోకి వచ్చాడు.

    అయితే న్యూడెమొక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) అధ్యక్షుడు ఎవరయ్యా అంటే.. ‘ఖలిస్తాన్’ కు మద్దతుదారు అయిన జగమీత్ సింగ్. ఎన్డీపీకి అధ్యక్షుడుగా ఉన్న జగమీత్ పార్టీలో సిక్కుల్లో గెలిచింది ఈయన ఒక్కడే. కాకపోతే అసలు లిబరల్ పార్టీ జస్టిన్ ట్రూడో పార్టీలో సిక్కులు ఎక్కువమంది ఉన్నారు. వాళ్లు పోయినసారి 2021 మొత్తం 16మంది సిక్కులు పార్లమెంట్ లో ఉంటే.. 13 మంది లిబరల్ పార్టీ నుంచే గెలిచారు. ఒకరు ఎన్డీపీ, ఇద్దరు కన్జర్వేటివ్ పార్టీ ప్రతిపక్షంలోంచి గెలిచారు.

    2019 తో పోలిస్తే సిక్కుల ప్రాధాన్యత తగ్గింది తప్పితే పెరగలేదు. మొత్తం జనాభాలో సిక్కులు 2.1 శాతం (770 వేల మంది) ఉన్నారు. మన భారత్ లో 1.7 శాతం మంది మాత్రమే సిక్కులు ఉన్నారు. దీంతో కెనడాలో సిక్కులు కీలకంగా ఉన్నారు.

    జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిలబడడానికి కెనడాలో సిక్కులు కీలకం. అధికారం కోసం ట్రూడో సిక్కుల కు అండగా ఉంటూ భారత్ పై విషం చిమ్ముతున్నారు. ఖలిస్తానీ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.

    కెనడాలో భారత్ వ్యతిరేక కార్యకలాపాలు ఎందుకు చోటుచేసుకుంటున్న తీరుపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.