Telugu News » Sports » For rajvardhan hangargekar wonderful bowling pakistan lost acc mens emerging tournament
Rajvardhan Hangargekar : ధోనీ శిష్యుడా.. మజాకా..! పాక్ -ఏతో మ్యాచ్ లో చెలరేగిన మహీ బౌలర్
రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ సంధించిన నిప్పులు చెరిగే బంతులకు పాకిస్తాన్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను చూసిన ఎంతోమంది ధోని శిష్యుడా మజాకా అంటూ కొనియాడుతున్నారు. ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఈ ఆటగాడికి కలిసి వచ్చిందంటూ పలువురు పేర్కొంటున్నారు.
Rajvardhan Hangargekar : ఏసిసి మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో యువ భారత్ అదరగొట్టింది. పాకిస్తాన్ ఏ జట్టుపై 8 వికెట్ల తేడాతో భారత్ ఏ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరుతో సాయి సుదర్శన్ అజేయ శతకం సాధించి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడు. అయితే అంతకు ముందు బౌలింగ్ లో మహేంద్ర సింగ్ ధోని శిష్యుడు, ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ ఐదు వికెట్లతో చెలరేగి పాకిస్తాన్ యువ జట్టు పతనాన్ని శాసించాడు. దీంతో ఏ దశలోనూ పాకిస్తాన్ జట్టు కోలుకోలేకపోయింది.
ఈ ఏడాది ఐపీఎల్ లో రాజ్ వర్ధన్
హ్యాంగర్గేకర్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ధోని సారధ్యంలో రెండు మ్యాచ్ లు ఆడాడు. రెండు మ్యాచ్ ల్లో మూడు వికెట్లతో తన సత్తాను చాటాడు ఈ యంగ్ క్రికెటర్. ముఖ్యంగా ధోని సారధ్యంలో ఆడడం ఎంతో అనుభవాన్ని ఇచ్చిందని ఈ క్రికెటర్ గతంలోనే చెప్పాడు. ఎటువంటి సమయాల్లో ఎలా బౌలింగ్ చేయాలో ధోని చెబుతూ ఉంటాడని, దానివల్ల మరింత అద్భుతంగా బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుందని ఈ యంగ్ క్రికెటర్ గతంలో పేర్కొన్నాడు. గతంలో చెప్పినట్లుగానే అద్భుతమైన బౌలింగ్ తో ఏసిసి మెన్స్ ఎమర్జింగ్ టోర్నీలో అదరగొట్టాడు. పాకిస్తాన్ తో బుధవారం సాయంత్రం జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ పతనాన్ని శాసించాడు. రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ అద్భుతమైన బౌలింగ్ కు పాకిస్తాన్ జట్టు విలవిల్లాడింది. ఏ దశలోను కోలుకోనీయకుండా చేయడంతో తక్కువ స్కోరుకు మాత్రమే పాకిస్తాన్ జట్టు పరిమితమైంది. దీంతో స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సులభంగా చేధించి ఘన విజయం సాధించింది.
కీలక ఆటగాళ్ల వికెట్లు పడగొట్టి..
పాకిస్తాన్ తో మ్యాచ్ లో రాజ్ వర్ధన్
హ్యాంగర్గేకర్ కీలకమైన వికెట్లను పడగొట్టి పాకిస్తాన్ జట్టు కోలుకోలేని విధంగా దెబ్బతీశాడు. పాకిస్తాన్ ఓపెనర్ షేయీమ్ అయిబ్, ఓమైర్ యూసఫ్, క్యాషిమ్ అక్రమ్, మహమ్మద్ వాషిమ్ జూనియర్, ఎస్ దహని వికెట్లను పడగొట్టాడు. నాలుగు కీలక వికెట్లను పడగొట్టడం ద్వారా పాకిస్తాన్ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ సంధించిన నిప్పులు చెరిగే బంతులకు పాకిస్తాన్ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఈ మ్యాచ్ లో రాజ్ వర్ధన్ హ్యాంగర్గేకర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనను చూసిన ఎంతోమంది ధోని శిష్యుడా మజాకా అంటూ కొనియాడుతున్నారు. ఐపీఎల్ లో ఆడిన అనుభవం ఈ ఆటగాడికి కలిసి వచ్చిందంటూ పలువురు పేర్కొంటున్నారు.