TDP AI Anchor : టీడీపీ పూర్వ వైభవం కోసం నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే ఇప్పటికే సగానికిపైగా నడిచేశారు. 2100 కిలోమీటర్ల మైలురాయిని దాటేశారు. అయితే పాదయాత్రలో సగం లక్ష్యం పూర్తయినా లోకేష్ కు అనుకున్నంత మైలేజీ రావడం లేదు. ఎల్లో మీడియా ఎంత చేస్తున్నా హైప్ రావడం లేదు. దీంతో చంద్రబాబు అండ్ కో ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ముఖ్యంగా పవన్ లాంటి వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు మీడియా వాచ్ అంతా అటు వైపు వెళుతోంది. దీంతో లోకేష్ కు ప్రయారిటీ తగ్గుతోంది. అందుకే ఐటీడీపీ విభాగం కొత్త ఆలోచన చేసింది. యువగళం పాదయాత్రకు తామే సొంతంగా ప్రచారం చేసుకోవడానికి డిసైడ్ అయ్యింది.
ప్రస్తుతం లోకేష్ యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. కనిగిరి నియోజకవర్గంలో యువనేత నడుస్తున్నారు. ఈ నేపథ్యంలో వినూత్న ఆలోచన చేసింది ఐటీడీపీ విభాగం. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు) సాయంతో ఒక యాంకర్ ను క్రియేట్ చేశారు.యాంకరమ్మకు ‘‘వైభవి’’ అన్న పేరును పెట్టారు. దీన్ని ఐ టీడీపీ కనిగిరి విభాగం రూపొందించింది. లోకేశ్ పాదయాత్ర వార్తల్ని.. విశేషాల్ని వైభవి చేత చదివిస్తూ.. లేని హైప్ ను తీసుకురావటం కోసం తెలుగు తమ్ముళ్లు కిందా మీదా పడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర విశేషాల్ని వివరిస్తున్న డిజిటల్ యాంకర్ వైభవితోకూడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేసే పనిలో పడ్డారు.
తొలుత రాయలసీమతో యాత్ర ప్రారంభమైంది. మీడిల్ ఆంధ్రాలో ప్రవేశించింది. అయితే రాయలసీమలో కొంతవరకూ పాదయాత్ర పర్వాలేదనిపించింది. కోస్తా ప్రాంతం టీడీపీకి పట్టు ఉండడంతో హైప్ క్రియేట్ అవుతుందని చంద్రబాబు అండ్ కో భావించింది. కానీ అనుకున్న స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. సాదాసీదాగానే కొనసాగుతోంది. దీంతో ఏదో ఒక కాన్సెప్ట్ తో పాదయాత్ర ను పైకిలేపాలని కొంతమంది టీడీపీ జీనియస్ ప్రభాకర్స్ ముందుకొచ్చారు. కొత్త ఐడియాలజీని తెరపైకి తెచ్చి అమలు చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.