https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: వైరల్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్… ఈ 12 మందిలో మీ ఫేవరేట్ కంటెస్టెంట్ ఉన్నాడా?

అధికారక ప్రకటనకు ముందే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్లోకి వెళుతున్న 12మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉన్నారో లేదో చెక్ చేసుకోండి...

Written By:
  • S Reddy
  • , Updated On : August 22, 2024 / 12:19 PM IST

    Bigg Boss 8 Telugu(12)

    Follow us on

    Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ తెలుగు 8 అనుకున్న సమయం కంటే ముందే రాబోతుంది. లేటెస్ట్ సీజన్ లాంచింగ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అనగా షో స్టార్ట్ కావడానికి ఇంకా పది రోజుల సమయం కూడా లేదు. కానీ ఇప్పటికీ టోటల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ కాలేదని తెలుస్తుంది. అయితే కొద్ది రోజులుగా సీజన్ 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరు సెలెబ్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ లిస్ట్ మొత్తం తారుమారైందట. ఎవరూ ఊహించని పేర్లు తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు 12 మంది కన్ఫర్మ్ అయినట్లు పక్కా సమాచారం. వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ 8 కి సెలెక్ట్ అయిన సభ్యుల లిస్ట్ పరిశీలిస్తే .. యాంకర్ రీతూ చౌదరి, సీరియల్ నటుడు నిఖిల్, యాంకర్ విష్ణు ప్రియ, యాంకర్ సౌమ్య రావ్.

    అంజలి పవన్ (వైల్డ్ కార్డు ఎంట్రీ) అంటున్నారు. వీరితో పాటు మోడల్ ఊర్మిళ చౌహాన్, యూట్యూబర్ బెజవాడ బేబక్క, ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యాష్మి గౌడ, సింగర్ సాకేత్, అలీ తమ్ముడు నటుడు ఖయ్యూం, యాక్టర్ అభిరామ్ వర్మ, నటి సోనియా సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఆల్రెడీ ఇంటర్వ్యూలు పూర్తి చేసిన కంటెస్టెంట్స్ నలుగురు ఉన్నారు. నటి సన, మొగలిరేకులు ఫేమ్ ఇంద్రనీల్, తేజస్విని గౌడ, నటుడు, కమెడియన్ అభినవ్ గోమఠం.

    ఢీ ఫేమ్ శ్వేతా నాయుడు, కమెడియన్ రవి శివ తేజ, ఢీ ఫేమ్ అక్షిత, అమృత ప్రణయ్, బంచిక్ బబ్లు వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా బెజవాడ బేబక్క బిగ్ బాస్ 8 కి సెలెక్ట్ అవ్వడం విశేషం. మనం చెప్పుకున్న ప్రచారం అవుతున్న లిస్ట్ లో వాస్తవం ఎంత ఉండేది తెలియాలంటే… లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. 20 మంది కంటెస్టెంట్స్ ని మొదటిగా లోపలికి పంపించి, మరో ఐదుగురిని వైల్డ్ ద్వారా పంపుతారని సమాచారం.

    గత సీజన్ 7 సూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ 8 పై భారీగా అంచనాలు. ఈసారి ఎంటర్టైన్మెంట్ అంతకు మించి ఉంటుంది అని ప్రోమో ద్వారా చెబుతున్నారు. పైగా గత సీజన్ కి ఏమాత్రం తగ్గకుండా గేమ్స్, టాస్కులు సరికొత్తగా ప్లాన్ చేస్తున్నారట. మొన్నటి వరకు లాంచింగ్ ఎపిసోడ్ పై సస్పెన్స్ కొనసాగింది. తాజాగా ఆ తేదీ కూడా రివీల్ చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. దీంతో బీబీ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.