WPL 2025 Retention : త్వరలో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ జరగనుంది. దానికంటే ముందు మినీ వేలం నిర్వహించనున్నారు. దానికంటే ముందు ఐదు జట్లు తమ రి టెన్షన్ జాబితాను వెల్లడించాయి. ఈ జాబితాలో గత చాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ విజేత ముంబై ఇండియన్స్.. ఇతర గుజరాత్ జెయింట్స్, ఉత్తరప్రదేశ్ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తనకు అంతగా ఉపయోగపడని ప్లేయర్లను పక్కనపెట్టాయి. అయితే వచ్చే సీజన్ కోసం ప్రతి జట్టుకు సంబంధించి పర్స్ విలువను 13.25 కోట్ల నుంచి 15 కోట్లకు పెంపుదల చేశారు. అయితే వేలానికి సంబంధించి తేదీని బీసీసీఐ ఇంతవరకు తేదీ, వేదికను ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పురుషుల ఐపీఎల్ 2025 మెగా వేలానికంటే ముందు మహిళల ప్రీమియర్ లీగ్ మినీ వేలం జరుగుతుందని తెలుస్తోంది. రి టెన్షన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత గుజరాత్ .. 4.40 కోట్లతో అత్యధిక పర్స్ మనీ ఉన్న జట్టుగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ 3.90 కోట్లు, బెంగళూరు 3.25 కోట్లు, ముంబై 2.65 కోట్లు, ఢిల్లీ 2.50 కోట్లతో తదుపరి స్థానాలలో ఉన్నాయి.
రి టెన్షన్ జాబితా ఎలా ఉందంటే..
బెంగళూరు: స్మృతి మందాన (కెప్టెన్) , కనిక అహుజా, ఎక్తా, కేట్ క్రాస్, సోఫీ డివైన్, రేణుక సింగ్, ఆశా శోభన, శ్రేయాంక పాటిల్, ఎల్లిస్ ఫెర్రి, రిచా ఘోష్, సబ్బినేని మేఘన, జార్జియో వేర్ హమ్.
బెంగళూరు విడుదల చేసే ప్లేయర్లు వీళ్లే..
సిమ్రాన్, శ్రద్ద, శుభ, దిశా, ఇంద్రాణి, నదినే.
ముంబై ఇండియన్స్
అమేలియా కేర్, అమంజోత్, క్లో ట్రయాన్, హర్మన్ ప్రీత్ కౌర్, హేలీ మాథ్యూస్, యాస్తికా, పూజ, కలిత, సైకా ఇషాక్, షబ్నిమ్, సజన, అమన్ దీప్, కీర్తన బాలకృష్ణన్.
ముంబై విడుదల చేసే ప్లేయర్లు
ఇస్సి, ఫాతిమా, ప్రియాంక, హుమైరా.
ఢిల్లీ క్యాపిటల్స్
అలిస్, అరుంధతి, జెమిమా, జెస్ జోనాస్సెన్, మారిజానే, మెక్ లార్నింగ్, రాధా యాదవ్, మిన్ను మణి, శిఖ, షఫాలి వర్మ, స్నేహ దీప్తి, టిటాస్ సాధు, అన్నా బెల్.
ఢిల్లీ విడుదల చేసే ప్లేయర్లు
లారా, అశ్విని, అపర్ణ, పూనం
యూపీ వారియర్స్
సైమా, పూనం, బృంద, తహలియా, శ్వేత, రాజేశ్వరి గైక్వాడ్, చమరి, కిరణ్ నవ్ గిరి, గ్రేస్ హారిస్, దీప్తి శర్మ, అంజలి, అలిస్సా హీలి.
యూపీ విడుదల చేసే ప్లేయర్లు
లారెన్ బెల్, పార్సవి, లక్ష్మీ యాదవ్, చొప్పదండి యశశ్రీ.
గుజరాత్ జెయింట్స్
సయాలి, మన్నత్, ప్రియా మిశ్రా, మేఘన సింగ్, ఫోబ్, షబ్నం, బెత్ మూని, ఆష్లీ గార్డ్, హేమలత, హర్లిన్, తనూజ, ఫోబ్, లారా.
గుజరాత్ విడుదల చేసే ఆటగాళ్లు వీరే
స్నేహ, క్యాథరిన్, త్రిష, తరన్నం పఠాన్, లీ తహూ, వేద కృష్ణమూర్తి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Five teams have revealed their retention list ahead of the mini auction
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com