https://oktelugu.com/

Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ ను ఊరిస్తున్న ఐదు రికార్డులు.. అవి బద్దలు కొడితే అతడే నెంబర్ వన్

స్వదేశంలో టీమిండియా సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. తొలి టెస్ట్ చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా ప్రారంభం మొదలుకానుంది. రెండవ టెస్ట్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ లో జరుగుతుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 17, 2024 / 01:02 PM IST

    Ravichandran Ashwin

    Follow us on

    Ravichandran Ashwin: బంగ్లా జట్టుతో తొలి టెస్ట్ కు రోహిత్ నాయకత్వంలో 16 మంది సభ్యుల జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. 16 మంది ఆటగాళ్ల జాబితాలో టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అనిల్ కుంబ్లే తర్వాత ఆ స్థాయిలో భారత్ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ విభాగంలో బలంగా మారాడు. పైగా తొలి టెస్ట్ రవిచంద్రన్ అశ్విన్ సొంత మైదానంలో జరగడం అతనికి కలిసి వచ్చే అంశం. ఇదే సమయంలో అతడు గనుక మెరుగైన బౌలింగ్ చేస్తే ఈ ఐదు రికార్డులను బద్దలు కొట్టగలడు.

    కుంబ్లేను అధిగమించాలంటే..

    రవిచంద్రన్ అశ్విన్ భారత్ తరఫున టెస్టులలో వికెట్లు తీసిన బౌలర్ గా అవతరించడానికి ఇంకా కొంచెం సమయం ఎదురు చూడాలి. ఎందుకంటే అనిల్ కుంబ్లే 476 అంతర్జాతీయ వికెట్లను సాధించాడు. అతని రికార్డుకు రవిచంద్రన్ 22 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఆ వికెట్లను కనుక ఈ సిరీస్ లో పడగొడితే రవిచంద్రన్ అశ్విన్ ఆ ఘనత సాధించిన తొలి భారతీయ బౌలర్ గా నిలుస్తాడు.

    బంగ్లాదేశ్ జట్టుపై..

    రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్ జట్టుతో ఆరు టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. అతడు 23 వికెట్లు దక్కించుకున్నాడు. మరో 9 వికెట్లు సాధిస్తే భారత దిగ్గజ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ రికార్డును అధిగమిస్తాడు. జహీర్ ఖాన్ 31 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.

    మరోసారి ఐదు సాధిస్తే..

    ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో రవిచంద్రన్ అశ్విని ఇప్పటికే 10సార్లు 5 వికెట్ హాల్స్ సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ తో కలిసి అతడు అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ ఈ సిరీస్ లో మరోసారి 5 వికెట్ హాల్ సొంతం చేసుకుంటే.. రవిచంద్రన్ అశ్విన్ 11 సార్లు 5 వికెట్ల హాల్ సాధించిన తొలి బౌలర్ గా నిలుస్తాడు.

    ఆ ఘనతకు కొంత దూరంలో..

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ గా ఆస్ట్రేలియా బౌలర్ నాథన్ లియాన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతడు 187 వికెట్లు పడగొట్టాడు. ఈ ఘనతకు అశ్విన్ కేవలం 14 వికెట్ల దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్టులు ఆడుతున్న నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ ఈ ఘనత సులువుగా సాధిస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

    మరో 10 వికెట్లు సాధిస్తే..

    ప్రస్తుతం 2023 -25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ సీజన్ నడుస్తోంది. ఇందులో ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్ వుడ్ 51 వికెట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ 42 వికెట్లు సాధించాడు. అశ్విన్ మరో పది వికెట్లు సాధిస్తే హేజిల్ వుడ్ రికార్డును అధిగమిస్తాడు. 52 వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ ఆవిర్భవిస్తాడు.