Tasty Teja: బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్న టేస్టీ తేజ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడే. ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టి రాణించాడు. టేస్టీ తేజ ఎంటర్టైనర్ గా పేరుగాంచాడు. తనదైన పంచ్ లతో అలరించేవాడు. మనోడు పేరిట ఓ సెంటిమెంట్ కూడా ఉంది. టేస్టీ తేజ నామినేట్ చేస్తే ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావాల్సిందే. ఒక్క పల్లవి ప్రశాంత్ మాత్రమే ఆ సెంటిమెంట్ ని అధిగమించాడు. కిరణ్ రాథోడ్, షకీలా, శుభశ్రీ రాయగురు, రతిక రోజ్ తో పాటు పలువురు ఆయన నామినేట్ చేశాక ఎలిమినేట్ అయ్యారు.
సీరియల్ నటి శోభా శెట్టితో టేస్టీ తేజ సన్నిహితంగా ఉండేవాడు. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్. శోభ శెట్టి అత్యంత నెగిటివిటీ మధ్య అత్యధిక వారాలు రాణించింది. శోభా శెట్టి 14 వారాలు హౌస్లో ఉంది. ఇక టేస్టీ తేజ 9వ వారం ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ షో అనంతరం టేస్టీ తేజ ఫేమ్ బాగా పెరిగింది. అతడు బుల్లితెర ఈవెంట్స్ తో పాటు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు.
కాగా టేస్టీ తేజ భారీ ధర చెల్లించి వినాయక లడ్డును సొంతం చేసుకున్నాడు. టేస్టీ తేజ వినాయక చవితి వేడుకల కోసం సొంతూరు వెళ్ళాడు. గుంటూరు జిల్లా తెనాలి దగ్గరల్ ఆయన సొంతూరు అని సమాచారం. తమ గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నిమజ్జనం వేడుకలో టేస్టీ తేజ పాల్గొన్నాడట. ఈ సందర్భంగా వినాయక చేతిలోని లడ్డును వేలం వేయగా టేస్టీ తేజా పాడుకున్నాడట.
వేలంలో పోటీ పడిన టేస్టీ తేజ ఏకంగా రూ. 75 వేలకు లడ్డును పాడాడట. తమ గ్రామంలోని 25వ వినాయక ఉత్సవ వేడుకల్లో ఏర్పాటు చేసిన 25 కేజీల లడ్డును సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉందని టేస్టీ తేజ రాసుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. దప్పుల శబ్దానికి టేస్టీ తేజ డాన్స్ చేసి ఎంజాయ్ చేశాడు.
టేస్టీ తేజ సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చాడు. ఇతడు ఫుడ్ వ్లాగ్స్ చేస్తూ ఉండేవాడు. సోషల్ మీడియా స్టార్ హోదాలో బిగ్ బాస్ షోలో ఆఫర్ దక్కించుకున్నాడు. ఇప్పటికీ టేస్టీ తేజ ఫేమస్ రెస్టారెంట్స్, ఫుడ్ ఐటమ్స్ ని వివరిస్తూ వీడియోలు చేస్తూ ఉంటారు. టేస్టీ తేజకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంది.