Homeక్రీడలుUsman Tariq bowling criticism: చివరికి స్కాట్లాండ్ బౌలర్లు కూడా ఎర్రి పుష్పాన్ని చేస్తున్నారు..పాపం పాకిస్తాన్...

Usman Tariq bowling criticism: చివరికి స్కాట్లాండ్ బౌలర్లు కూడా ఎర్రి పుష్పాన్ని చేస్తున్నారు..పాపం పాకిస్తాన్ క్రికెటర్!

Usman Tariq bowling criticism: ఎదుటివాళ్లు మనం చేసే పని ఆధారంగానే గౌరవిస్తారు. మనం చేసే పని గొప్పగా ఉంటే.. గొప్పగానే చూస్తారు. అది నేలబారు తనంగా ఉంటే.. అలానే వ్యవహరిస్తారు. స్థూలంగా చెప్పాలంటే మనం పువ్వులు విసిరితే పువ్వులే వస్తాయి.. రాళ్లు విసిరితే రాళ్లు మాత్రమే వస్తాయి. ఈ మాత్రం ఇంగితాన్ని మనం ప్రదర్శించాలి. ప్రపంచంలో అన్ని దేశాలు చివరికి ఆఫ్రికా దేశాలు కూడా ఒక పద్ధతిని పాటిస్తాయి. ఒక విధానాన్ని కొనసాగిస్తాయి. కానీ పాకిస్తాన్ […]

Usman Tariq bowling criticism: ఎదుటివాళ్లు మనం చేసే పని ఆధారంగానే గౌరవిస్తారు. మనం చేసే పని గొప్పగా ఉంటే.. గొప్పగానే చూస్తారు. అది నేలబారు తనంగా ఉంటే.. అలానే వ్యవహరిస్తారు. స్థూలంగా చెప్పాలంటే మనం పువ్వులు విసిరితే పువ్వులే వస్తాయి.. రాళ్లు విసిరితే రాళ్లు మాత్రమే వస్తాయి. ఈ మాత్రం ఇంగితాన్ని మనం ప్రదర్శించాలి.

ప్రపంచంలో అన్ని దేశాలు చివరికి ఆఫ్రికా దేశాలు కూడా ఒక పద్ధతిని పాటిస్తాయి. ఒక విధానాన్ని కొనసాగిస్తాయి. కానీ పాకిస్తాన్ కి మాత్రం ఇది ఏదీ చేతకాదు. ఆ దేశ పరిపాలకులు ఎలా అయితే వ్యవహరిస్తారో.. అక్కడి ప్రజలు కూడా అలానే ఉంటారు. ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు టీమ్ ఇండియాతో క్రికెట్ ఆడుతుంటే.. దాయాది దేశ ప్రజలకు ఎక్కడా లేని ఆగ్రహం వస్తుంది. ఆ సమయంలో వారు కొత్త కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకొస్తారు. వారు వేసే బౌలింగ్.. చేసే బ్యాటింగ్ అంతా గమ్మత్తుగా ఉంటుంది.

తాజాగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఉస్మాన్ తారిఖ్ అనే బౌలర్ ను జట్టులోకి తీసుకుంది. అతడు బంతి వేసే విధానం ఎలా ఉంటుందంటే.. గల్లీ క్రికెట్లో వేసే బౌలింగ్ లాగా ఉంటుంది. బంతిని అందుకున్న తర్వాత.. దానిని విసరడానికి అతడు చాలా సమయం తీసుకుంటాడు. అది ఒకరకంగా బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇదే విషయాన్ని ఇటీవల ఐసీసీ దృష్టికి ఆస్ట్రేలియా ప్లేయర్లు తీసుకెళ్లారు. అయితే గతంలోనే ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ కు క్లీన్ చీట్ లభించింది.

ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ గల్లీ క్రికెట్ స్థాయి మాదిరిగా ఉండడంతో.. ఇతర జట్ల ప్లేయర్లు అతని బౌలింగ్ ను విమర్శిస్తున్నారు. కాకపోతే అది పరోక్షంగా చేస్తున్నారు. ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉస్మాన్ తారిఖ్ మాదిరిగా బౌలింగ్ వేశాడు. ఇప్పుడు స్కాట్లాండ్ ప్లేయర్లు కూడా అదే విధంగా బౌలింగ్ వేస్తున్నారు. దీనిని బట్టి ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ వారికి ఎంత చీప్ అయిపోయిందో అర్థం చేసుకోవచ్చు..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper