https://oktelugu.com/

పబ్ జీ ఖతం.. ఫౌ–జీ ఆగయా

పబ్జీ.. చైనా గేమ్‌. గేమ్‌ చైనాదే అయినా.. ఇండియాలో ఆ గేమ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. 10 ఏళ్ల కుర్రాడి నుంచి 30 ఏళ్ల యువకుడి వరకు పబ్జి ప్రియులే. ఎవరి ఫోన్‌లో చూసినా ఈ గేమ్‌ ఉండాల్సిందే. గ్రూపులుగా విడిపోయి మరీ గేమ్‌ ఆడడం హ్యాబీ. అయితే.. ఇంత క్రేజీ ఉన్న గేమ్‌ను ఇటీవల కరోనా నేపథ్యంలో మన దేశంలో బ్యాన్‌ చేశారు. దీంతో అప్పటి నుంచి అలాంటి గేమ్‌ కోసమే మన […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 27, 2021 4:14 pm
    Follow us on

    PUBG, FAU-G, Google Play Store, New game, Battlegrounds, download, overview, FAU-G game download
    పబ్జీ.. చైనా గేమ్‌. గేమ్‌ చైనాదే అయినా.. ఇండియాలో ఆ గేమ్‌కు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. 10 ఏళ్ల కుర్రాడి నుంచి 30 ఏళ్ల యువకుడి వరకు పబ్జి ప్రియులే. ఎవరి ఫోన్‌లో చూసినా ఈ గేమ్‌ ఉండాల్సిందే. గ్రూపులుగా విడిపోయి మరీ గేమ్‌ ఆడడం హ్యాబీ. అయితే.. ఇంత క్రేజీ ఉన్న గేమ్‌ను ఇటీవల కరోనా నేపథ్యంలో మన దేశంలో బ్యాన్‌ చేశారు. దీంతో అప్పటి నుంచి అలాంటి గేమ్‌ కోసమే మన దేశ యువత ఎదురుచూస్తోంది.

    అయితే.. ఏదేని మొబైల్‌ గేమ్‌ లాంచ్‌ అవుతోందంటే పెద్ద విషయం కాదు. కానీ.. ‘పబ్జీ’కి పోటీగా వస్తోందంటే అందరి కళ్లు దానికోసమే ఎదురుచూస్తుంటాయి. ఆ గేమ్‌ విడుదల కూడా పెద్ద విషయమే. పబ్జీ బ్యాన్‌ అయ్యాక.. మన దేశ సైన్యాన్ని ప్రతిబింబించేలా ఓ గేమ్‌ను రూపొందిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అదే ‘ఫౌ–జీ’. బాలీవుడ్‌ స్టార్‌‌ అక్షయ్‌ కుమార్‌‌ నేతృత్వంలో రూపొందిన ఈ గేమ్‌ ఈ రోజు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మరి గేమ్‌ ఎలా ఉంది..? దాని సంగతి ఏంటో ఓసారి చూద్దాం..!

    ఫౌ–జీ గేమ్‌లో మూడు రకాల మోడ్స్‌ ఉన్నాయి. క్యాంపెయిన్‌, టీమ్‌ డెత్‌ మ్యాచ్‌, ఫ్రీ ఫర్‌‌ ఆల్‌ అనే మూడు మోడ్స్‌ కనిపిస్తాయి. అయితే.. ప్రస్తుతం క్యాంపెయిన్‌ మోడ్‌ ఒక్కటే అందుబాటులోకి వచ్చింది. మిగిలిన మోడ్స్‌ త్వరలో అప్‌డేట్స్‌లో తీసుకొస్తారట. గేమ్‌ స్టార్ట్‌ చేసినప్పుడు గ్రాఫిక్స్‌ మీడియంలో ఉంటున్నాయి. అవసరమైతే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. పబ్జీ స్టైల్‌లో ఇతర ప్లేయర్స్‌ ఇందులో వ్యక్తులు కాదు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే కంప్యూటర్‌‌ బొమ్మలు. మన సైనికుడిలా వాటిని ఎవరూ హ్యాండిల్‌ చేయరు. మెకానికల్‌గా పనిచేస్తుంటాయి.

    గేమ్‌ ఎలానో తెలుసా..!

    గేమ్‌ స్టార్ట్‌ అయ్యేటప్పుడు పబ్జీ స్టయిల్‌లోనే ఇందులో కూడా చేతిలో ఎలాంటి ఆయుధాలు ఉండవు. ఏఐ శత్రుమూకల్ని హతమారుస్తూ వారి దగ్గరున్న ఆయుధాలను తీసుకోవాలి. తొలి రౌండ్స్‌లో శత్రుమూకల చేతిలో కత్తులు మాత్రమే ఉంటున్నాయి. దీంతో మనకు అవే అందుబాటులో ఉంటాయి. అందులో ఒక కత్తి ‘సింహాద్రి’లో ఎన్టీఆర్‌‌ పట్టుకున్న కత్తిలా ఉంటుంది. తర్వాతి రౌండ్స్‌లో గన్స్‌లో ఉన్నాయేమో చూడాలి. గేమ్‌ స్టార్ట్‌ అయినప్పుడు మొదటి రెండు రౌండ్లు చాలా సులభంగా ఉంటాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే శత్రు సైనికులు ఒక్కొక్కరిగా ఎదురుపడి దాడి చేస్తుంటారు. అయితే.. స్టేజీలు పెరిగే కొద్దీ గేమ్‌లో కష్టం పెరుగుతూ వస్తుంది. ఏఐ మూకలు ఒకేసారి మీద పడతాయి. అయితే.. కొన్నిసార్లు దాడి చేసేటప్పుడు లాగ్‌ కనిపిస్తోంది. శత్రు సైనికులు చుట్టుముట్టినప్పుడు మన సైనికుడు సరిగా కనిపించడం లేదు.

    తేడాలు ఇవే..

    పబ్జీ ఇన్‌స్టంట్‌గా ఎనర్జీని పెంచుకొని.. గేమ్‌లో కొనసాగడానికి డ్రింక్స్‌ లాంటివి ఉంటాయి. ఇందులో అలాంటి ఆప్షన్‌ లేదు. అక్కడక్కడ ఉన్న క్యాంప్‌ ఫైర్స్‌ దగ్గర కూర్చొని చలి కాచుకుంటే అప్పుడు ఎనర్జీ బూస్టింగ్‌ అవుతుంది. మరోవైపు ఆయుధాల పవర్‌‌ కూడా తక్కువగా ఉంటోంది. ఒక్కో కత్తి గరిష్టంగా 10–15 దెబ్బలకు మాత్రమే పనిచేస్తోంది. దీంతో పిడిగుద్దులే దిక్కవుతాయి. దీంతో మూడో రౌండ్‌ దాటడం సాధారణ ప్లేయర్స్‌కు కష్టం. మరోవైపు ఆయుధాలు కేవలం శత్రు మూకల దగ్గరే ఉండడంతో ట్రెజర్‌‌ హంట్‌ చేసిన ఫీలింగ్‌ కూడా కలగదు. పబ్‌జీ, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ, ఫ్రీ ఫైర్‌‌ లాంటి గేమ్స్‌లో ఇదో ఎంటర్‌‌టైనింగ్‌ టాపిక్‌. తొలి రౌండ్‌లో 30 నిమిషాల టైమర్‌‌తో మొదలవుతుంది. ఇందులో స్టేజీలు ఉంటాయి. ఏ స్టేజీలో ఎంతవరకు వచ్చామనేది పైన బార్‌‌లో చూపిస్తుంటుంది.

    పిడిగుద్దులు తప్ప గన్స్‌ లేవు..

    వార్‌‌ గేమ్స్‌ అంటే.. ఒకసారి ప్లే బటన్‌ నొక్కాక.. మళ్లీ పాజ్‌ ఉండదు. అలాంటప్పుడే లైవ్‌ గేమ్‌ ఆడిన అనుభూతి కలుగుతుంది. చాలా వార్‌‌ గేమ్స్‌ అలానే ఉన్నాయి. అయితే.. ఇందులో గేమ్‌ను పాజ్‌ చేసుకోవచ్చు. ఇది వార్‌‌ గేమ్‌ ప్లేయర్స్‌కు అంతగా రుచించదు. అలాగే శత్రు మూక సైన్యానికి ఎంత ఆయుష్షు ఉందనేది ఎక్కడా చూపించదు. అలా వరుసగా దెబ్బలు కొడితే ఓ క్షణంలో కుప్పకూలిపోవడమే. ఇక్కడ సినిమాటిక్‌ ఫైట్‌ సీన్స్‌ రిఫరెన్స్‌లు కనిపిస్తాయి. ప్రస్తుతానికి గేమ్‌ గల్వాన్‌ లోయ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో కేవలం పిడిగుద్దులు, కత్తులు తప్ప గన్స్‌ ఉండవు. దీంతో అంతగా ఆసక్తిగా అనిపించదు. మిగిలిన రెండు మోడ్స్‌ ఓపెన్‌ అయితే ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా అనిపించొచ్చు.

    మన సైనికుల వీరోచిత పోరాటం చెప్పేందుకే..

    పబ్‌జీకి పోటీ అంటూ ప్రచారం జరిగింది కాబట్టి ఈ గేమ్‌ మీద భారీ అంచనాలే ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాంపెయిన్‌ మోడ్‌తో ఈ గేమ్‌ పబ్జీ ప్రేమికుల అంచనాలను అందుకోలేకుండా ఉంది. మిగిలిన రెండు మోడ్స్‌ ఆన్‌ అయితే కానీ ఏమైనా మార్పులు ఉండొచ్చేమో చూడాలి. మొబైల్‌ గేమ్స్‌ ఆడే చిన్నారులతో ఈ గేమ్‌ ఆడించి.. ‘గల్వాన్‌’ ఘటన గురించి, ఆ టైమ్‌లో మన సైనికుల వీరోచిత పోరాటం గురించి చెప్పడానికి ఉపయోగకరంగా ఉంటుంది. మన సైనికుడు వీరమరణం పొందినప్పుడు ‘భారత్‌ మాతాకీ జై’ అంటూ ప్రాణాలు విడవడం కనిపిస్తుంటుంది. దేశభక్తిని పెంచుతూ.. వార్‌‌ గేమ్స్‌ ఆడించాలంటే ‘ఫౌ–జీ’ ట్రై చేయవచ్చనేది స్పష్టం.

    -శ్రీనివాస్