Homeఎంటర్టైన్మెంట్పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ అది !

పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ అది !

Pawan Kalyan
పవన్-క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ. 170 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు నిర్మాత ఏఎం రత్నం. మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేస్తున్నారు. ఆల్రెడీ ప్రస్తుతం చార్మినార్ సెట్ వేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో మరో దర్బార్ సెట్ కూడా వేస్తున్నారు. అలాగే రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. మొదట ఈ సినిమా కోసం 100 నుంచి 120 కోట్ల రూపాయలు అనుకున్నాడట నిర్మాత.

కానీ బడ్జెట్ మరో 50 కోట్ల రూపాయలు పెరిగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మరో హీరోయిన్ గా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి వచ్చే షెడ్యూల్ లో మూడు సాంగ్స్ షూట్ చేయనున్నారు. ఇప్పటికే మేజర్ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన షూట్ కోసం రెడీ అవుతుంది. పవన్ ఆల్ రెడీ ఇప్పటివరకూ అయిన ఈ సినిమా ఫుటేజ్ ను చూసాడట.

కాగా పవన్ కి సినిమా చాలా బాగా నచ్చిందట. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. అందుకే క్రిష్ ఈ సినిమాకి మరింత గ్రాండ్ నెస్ ను తీసుకు వచ్చేందుకు పరభాషా నటులను కూడా ఎంచుకుంటున్నారు. అలాగే పవన్ ను చూసి ఓ గిరిజిన యువతి ప్రేమలో పడుతుందని.. ఆ పాత్రలో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను తీసుకోనున్నారట. ఇక ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం మొత్తానికి రిస్క్ చేసి ఈ సినిమాని చేస్తున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version