https://oktelugu.com/

మరో రూట్‌లో వెళ్లిన కేంద్రం..: రైతు ఉద్యమంపై ఉక్కుపాదం తప్పదా..?

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకం అయింది. ర్యాలీని ప్రశాంతంగా జరుపుకోవాలని సుప్రీం కోర్టు సూచించినా కొందరు అల్లరి మూకలు మాత్రం అలజడి సృష్టించారు. రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ దారి తప్పింది. కొంత మంది ఎర్రకోటపైకి ఎక్కి సంబంధం లేని జెండాలు ఎగురేశారు. మరికొంత మంది పోలీసులపై దాడులు చేశారు. ఏకంగా రాళ్లు విసిరారు. మొత్తంగా విధ్వంసంతో పాటు అలజడి సృష్టించారు. Also Read: బ్రేకింగ్: సౌరవ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 27, 2021 / 04:02 PM IST
    Follow us on


    వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమం హింసాత్మకం అయింది. ర్యాలీని ప్రశాంతంగా జరుపుకోవాలని సుప్రీం కోర్టు సూచించినా కొందరు అల్లరి మూకలు మాత్రం అలజడి సృష్టించారు. రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు చేపట్టిన ర్యాలీ దారి తప్పింది. కొంత మంది ఎర్రకోటపైకి ఎక్కి సంబంధం లేని జెండాలు ఎగురేశారు. మరికొంత మంది పోలీసులపై దాడులు చేశారు. ఏకంగా రాళ్లు విసిరారు. మొత్తంగా విధ్వంసంతో పాటు అలజడి సృష్టించారు.

    Also Read: బ్రేకింగ్: సౌరవ్ గంగూలీకి మళ్లీ గుండెపోటు.. సీరియస్?

    రైతులు రెండు నెలలుగా ఉద్యమం నడిపిస్తున్నా ఎప్పుడూ ఎక్కడా మరక పడకుండా చూశారు. కానీ.. ఈ ర్యాలీతో ఒక్కసారిగా రైతులపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఏర్పడింది. దీనిపై రైతు సంఘాలు బీజేపీపై.. బీజేపీ నేతలు రైతు సంఘాలపై ఆరోపణలు ప్రారంభించారు. బీజేపీ మద్దతుదారులు.. రైతులను దేశద్రోహులుగా చిత్రీకరిస్తూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం ఉద్ధృతంగా ఉంది. అయితే.. దాడులు దిగిన వారితో రైతులకు ఏం సంబందం లేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ విధ్వంసం వెనుక దీప్ సిద్ధూ అనే పంజాబీ సింగర్, యాక్టర్ కీలకంగా వ్యవహరించారనేది వెల్లడవుతోంది. ఆయన బీజేపీ ఎంపీ సన్నిడియోల్‌కు సన్నిహితుడు. గతంలో మోడీతో కలిసి ఫొటోలు కూడా దిగారు.

    ఇప్పుడు సోషల్ మీడియాలో ఇవి హైలెట్ అవుతున్నాయి. కానీ.. చివరకు నింద మాత్రం రైతుల మీద పడింది. రైతులు కట్టు తప్పారని .. ఎర్రకోటపై దాడికి వెళ్లి దేశానికి చెడ్డపేరు తెచ్చారన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం ఎంత ఒత్తిడి చేసినా వెనుకడుగు వేయకుండా పోరాడుతున్న రైతులను ఎలాగైనా వెనక్కి తగ్గేలా చేయడానికి కేంద్రం అనేక ప్రయత్నాలు చేసింది. రైతు సంఘాల నేతలపై ఎన్‌ఐఏ కేసులు కూడా పెట్టినంత పని చేసింది.

    Also Read: ఇవాళ పీఆర్సీ నివేదిక..: కనీస వేతనం 19 వేలు

    రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపడం కేంద్రానికి పెద్ద విషయమేమీ కాదు. కానీ.. అది జాతీయ సమస్యగా ఎక్కడ మారుతుందోనన్న కారణం, రైతుల మీద ఉన్న గౌరవంతోనే వెనకడుగు వేస్తోందనేది వాస్తవం. రైతుల ఉద్యమానికి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో హింస వారికి కలిసొచ్చినట్లుగా కనిపిస్తోంది. రైతుల ఉద్యమంపై ఇప్పటికే నెగెటివ్ ప్రచారాన్ని ఉద్ధృతంగా చేస్తున్న బీజేపీ సోషల్ మీడియా దాన్ని మరింత పెంచే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత కేంద్రం రైతు ఉద్యమంపై ఉక్కుపాదం మోపి అణిచేయడానికి ఎక్కువ అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్