SRH Vs KKR Final 2024: సన్ రైజర్స్ సరికొత్త రికార్డు.. ఆ లాజిక్ ప్రకారం ఐపీఎల్ కప్ కమిన్స్ సేన దే..

175 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించలేదు. ఓపెనర్లు చాలా నిదానంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా టామ్ కోహ్లేర్ చాలా ఇబ్బంది పడ్డాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 25, 2024 10:59 am

SRH Vs KKR Final 2024

Follow us on

SRH Vs KKR Final 2024: క్వాలిఫైయర్ -1 లో కోల్ కతా చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన హైదరాబాద్ జట్టు.. ఆ తర్వాత అదే స్థాయిలో పుంజుకుంది. శుక్రవారం రాత్రి చెన్నై వేదికగా రాజస్థాన్ రాయల్ జట్టుతో క్వాలిఫైయర్ -2 మ్యాచ్లో విజయం సాధించి ఫైనల్ దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 రన్స్ చేసింది. క్లాసెన్ 50, హెడ్ 37, హెడ్ 34, షాబాజ్ అహ్మద్ 18 పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్ , ఆవేశ్ ఖాన్ తలా మూడు వికెట్లు తీశారు. సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.. అనంతరం లక్ష్య చేదనకు దిగిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 139 రన్స్ చేసింది.. ధృవ్ జురెల్ 56*, యశస్వి జైస్వాల్ 42 పరుగులు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రాజస్థాన్ జట్టులో మిగతా బ్యాటర్లు మొత్తం దారుణంగా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు తీశాడు. అభిషేక్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.. కమిన్స్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. ఆదివారం చెన్నై వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో హైదరాబాద్ కోల్ కతా ను ఢీకొంటుంది.

175 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ కు అదిరిపోయే ఆరంభం లభించలేదు. ఓపెనర్లు చాలా నిదానంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా టామ్ కోహ్లేర్ చాలా ఇబ్బంది పడ్డాడు. పది పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం సంజు శాంసన్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఈ దశలో భువనేశ్వర్ కుమార్ వేసిన ఆరో ఓవర్ లో యశస్వి జైస్వాల్ 6, 4, 0, 4, 4, 1 తో 19 పరుగులు రాబట్టాడు. ఫలితంగా రాజస్థాన్ జట్టు పవర్ ప్లే లో ఒక వికెట్ కోల్పోయి 51 రన్స్ చేసింది. అయితే ఈ దశలో స్పిన్నర్ షాబాజ్ అహ్మద్ మ్యాచ్ ను ఒక్కసారిగా మలుపు తిప్పాడు. అహ్మద్ వేసిన ఎనిమిదవ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టిన యశస్వి.. అదే ఓవర్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ సంజు కూడా అభిషేక్ శర్మ వేసిన మరుసటి ఓవర్లో భారీ షాట్ కొట్టబోయి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లలో రియాన్ పరాగ్ (6), రవిచంద్రన్ అశ్విన్ (0) త్వరగా అవుట్ కావడంతో మ్యాచ్ అనూహ్యంగా హైదరాబాద్ వైపు మరలింది. జురెల్ దాటిగా ఆడినప్పటికీ.. మరో ఎండ్ లో అతడికి సహకారం లభించలేదు. దీంతో రాజస్థాన్ ఓటమిపాలైంది. 36 పరుగుల తేడాతో హైదరాబాద్ ముందు తలవంచింది

ఇక క్వాలిఫైయర్- 2 లో రాజస్థాన్ జట్టును ఓడించి.. ఫైనల్ వెళ్లిన హైదరాబాద్.. గత సీజన్లో పాయింట్లు పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ జట్టు అట్టడుగు స్థానంలో ఉంది. సరిగ్గా ఏడాది గడిచేసరికి ఫైనల్ దూసుకెళ్లింది.. 2008 సీజన్లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న హైదరాబాద్.. 2009లో ఫైనల్ చేరి ఆశ్చర్య పరిచింది. అంతేకాదు బలమైన బెంగళూరును ఓడించి కప్ చేజిక్కించుకుంది. అంటే ఆ లాజిక్ ప్రకారం 2023లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్.. 2024లో ఫైనల్ దూసుకెళ్లిందని.. ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా ను ఓడించి కప్ దక్కించుకుంటుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.