https://oktelugu.com/

Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ స్టార్ హీరోగా ఎదగలేక పోవడానికి కారణం ఏంటంటే..?

ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నప్పటికి ఆ సినిమాలు కూడా యాక్టింగ్ ని ఎలివేట్ చేసే విధంగా ఉండకపోవడంతో అలాగే ఖాన్ త్రయం తో పోటీ పడలేక చాలా వరకు వెనకబడినట్టుగా కూడా తెలుస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : May 25, 2024 / 10:50 AM IST

    What is the reason why Abhishek Bachchan could not become a star hero

    Follow us on

    Abhishek Bachchan: బాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్ బీ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నటుడు అమితాబచ్చన్…ఈయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చాలా సినిమాలు చేసి ఇండియాలోనే టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ఆయన తర్వాత తన కొడుకు అయిన అభిషేక్ బచ్చన్ ను స్టార్ హీరోగా చేసే ప్రయత్నాలు అయితే చేశాడు.

    కానీ అవివేవి వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయనకి పెద్దగా స్టార్ అయ్యే సినిమాలైతే పడలేదు దానివల్ల ఆయన తన తండ్రి అయిన అమితాబ్ లాగా ఇండస్ట్రీలో ఎదగలేకపోయాడని చాలా మంది చెబుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే అభిషేక్ బచ్చన్ చేసిన సర్కార్, రన్, గేమ్, ధూమ్ లాంటి సినిమాలు అతనికి మంచి పేరునైతే తీసుకొచ్చినప్పటికీ స్టార్ హీరోగా మాత్రం మారలేకపోయాడు.. ఇక దాంతో అమితా బచ్చన్ కి ఈయన విషయంలో కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటుందట.

    ఇక ఇదే కాకుండా ఆయన ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నప్పటికి ఆ సినిమాలు కూడా యాక్టింగ్ ని ఎలివేట్ చేసే విధంగా ఉండకపోవడంతో అలాగే ఖాన్ త్రయం తో పోటీ పడలేక చాలా వరకు వెనకబడినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే అభిషేక్ బచ్చన్ సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్ లు కూడా తనకు అంత బాగా యాప్ట్ కాలేదని మరి కొంతమంది విమర్శకులు సైతం ఆయన మీద ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక మొత్తానికైతే ఇప్పుడు ఆడపదడపా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇక ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడం లో కొంతవరకు తడబడ్డాడు.

    అందువల్లే ఆయన బాలీవుడ్ లో మిగతా హీరోలు ఎదిగినట్టుగా స్టార్ హీరోగా రాణించలేకపోతున్నాడు… ఇక అమితా బచ్చన్ ఇప్పటికి కూడా వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు. ఇక ప్రభాస్ హీరోగా నాగశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమాలో కూడా ఈయన క కీలక పాత్ర లో నటించారు. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది…