Mohammad Hafeez: విరాట్ కొహ్లీపై పాక్ మాజీ క్రికెటర్ హఫీజ్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

90 రన్స్ ఉన్నప్పుడు పెద్ద షాట్లు ఆడకుండా సెంచరీకి ట్రై చేస్తున్నాడంటే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయను. కానీ 95 రన్స్ చేసిన తర్వాత సెంచరీకి చేరుకునేందుకు 5 బంతులు తీసుకుంటే స్వార్థపరుడనే అంటాను. అతను 95 లేదా 92 పరుగుల వద్ద ఉన్నప్పుడు పెద్ద షాట్ ను ఎందుకు ఆడలేకపోయాడు.

Written By: Neelambaram, Updated On : June 21, 2024 5:29 pm

Mohammad Hafeez

Follow us on

Mohammad Hafeez: వరల్డ్ కప్-2023 జరుగుతున్న సమయంలో విరాట్ కొహ్లీని స్వార్థపరుడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ అన్నారు. ఆ సందర్భంలో అన్న విరాట్ తనకున్న అభిప్రాయాన్ని ఇప్పటికీ మార్చుకోలేదని హఫీజ్ మరోసారి చెప్పారు. క్లబ్ ప్రైరీ ఫైర్ పాడ్ కాస్ట్ లో ఇటీవల జరిగిన కార్యక్రమంలో మహ్మద్ హఫీజ్ కొహ్లీని స్వార్థపరుడని అనడం సరైనదేనని చెప్పాడు. ఈ పాడ్ కాస్ట్ లో మైఖేల్ వాన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ వంటి మాజీ క్రికెటర్లు ఉన్నారు. కొహ్లీపై చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ ప్రశ్నించగా.. ‘ఆ సమయంలో నేను చెప్పింది కరెక్టే అంటూ సమర్ధించుకున్నాడు హఫీజ్. సందర్భాన్ని గమనించే నేను వ్యాఖ్యలు చేశాను. ఎవరు ఆడుతున్నా గెలవాలనే కోరుకుంటాం. అదే జట్టుకు మనం అందించే అమూల్యమైన గిఫ్ట్ కానీ విరాట్ తన కోసం చూసుకున్నాడు.

‘90 రన్స్ ఉన్నప్పుడు పెద్ద షాట్లు ఆడకుండా సెంచరీకి ట్రై చేస్తున్నాడంటే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయను. కానీ 95 రన్స్ చేసిన తర్వాత సెంచరీకి చేరుకునేందుకు 5 బంతులు తీసుకుంటే స్వార్థపరుడనే అంటాను. అతను 95 లేదా 92 పరుగుల వద్ద ఉన్నప్పుడు పెద్ద షాట్ ను ఎందుకు ఆడలేకపోయాడు?

నా దృష్టిలో సెంచరీ ముఖ్యం కాదు.. జట్టు గెలవాలన్నదే వరల్డ్ కప్ లాంటి ఆటలో ఒక్కో బాల్, ఒక్కో రన్ చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆడాలి. తను సెంచరీ పూర్తి చేసుకునేందుకు 5 బాల్స్ ను వాడుకోవడం సరైనది కాదు. మ్యాచ్ లో సెంచరీ పూర్తి చేసేందుకు చాలా బాల్స్ తీసుకున్నాడు. ఆ సమయంలో అతను పెద్ద షాట్లు ఆడడం లేదని నేను భావించా. నా దృష్టిలో వ్యక్తి గత మైలురాళ్లు క్రికెట్ కు దూరంగా ఉండాలని అనుకుంటా.. మీ ఆఫ్ సెంచరీ, సెంచరీ లేదా 5 వికెట్లను మేము చూడాలనుకోవడం లేదు, ఎందుకంటే, క్రికెట్ లో, ఒక్క పరుగు కూడా చాలా విలువైనదే’.

‘ఈ వరల్డ్ కప్ లో విరాట్ కొహ్లీ బ్యాటింగ్ లో స్వార్థం కనిపించింది. 49వ ఓవర్ లో సెంచరీ సాధించేందుకు సింగిల్ తీసుకోవాలని చూశాడు.. కానీ అతను జట్టుకు మొదటి ప్రనియారిటీ ఇవ్వలేదు’ అని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ టాప్ క్రికెట్ అనాలిసిస్ అనే క్రికెట్ షోలో చెప్పాడు.