https://oktelugu.com/

Jagan: అసెంబ్లీ వద్ద జగన్ కు ఘోర అవమానం.. వైరల్ వీడియో

ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టారు జగన్. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే గతంలో స్ట్రైట్ గా వెళ్లేవారు. కానీ ఈసారి వెనకనుంచి అసెంబ్లీ లోపలికి ప్రవేశించాల్సి వచ్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : June 21, 2024 5:33 pm
    Jagan

    Jagan

    Follow us on

    Jagan: కాలం కలిసి రానప్పుడు తాడే పామై కనిపిస్తుందంటారు. వెంటాడుతుందంటారు. ఈ విషయంలో ఎవరు అతీతులు కాదు. నిన్నటి వరకు అంతులేని జనాకర్షణ నేతగా జగన్ ఎదిగారు. ఐదు సంవత్సరాల పాటు అంతులేని అధికార దర్పాన్ని ప్రదర్శించగలిగారు జగన్. కనుసైగతో ఏపీని శాసించగలిగారు. ఆయనపై ఈగ వాలితే చాలు పెద్ద బృందమే వచ్చి పడిపోయేది. ఎవరైనా చిన్న మాట అంటేనే సహించేది కాదు ఆ బృందం. కానీ అధికారం పోయింది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రభుత్వ భద్రత తగ్గిపోయింది. ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోవాల్సి వచ్చింది.

    ఓటమి తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టారు జగన్. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే గతంలో స్ట్రైట్ గా వెళ్లేవారు. కానీ ఈసారి వెనకనుంచి అసెంబ్లీ లోపలికి ప్రవేశించాల్సి వచ్చింది. ఈ క్రమంలో అసెంబ్లీ వద్ద జగన్ చేదు అనుభవం ఎదురైంది. అసెంబ్లీ వద్ద ఆయన కాన్వాయ్ ని కొందరు ఆకతాయిలు ఫాలో అయ్యారు. జగన్ మామయ్య జగన్ మామయ్య అంటూ కేకలు వేశారు. అంతటితో ఆగకుండా ఫోటోలు, వీడియోలు తీశారు. జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వారిని వారించారు. అయినా సరే వారు వినలేదు. చివరకు పోలీసులు కలుగజేసుకోవడంతో వెనక్కి తగ్గారు.

    గత ఐదేళ్ల కాలంలో జగన్ ను అతి దగ్గర నుంచి చూడాలంటే వీలు పడేది కాదు. జగన్ తాడేపల్లి నుంచి బయటకు అడుగుపెడితే వందలాది మంది పోలీసులు మొహరించేవారు. జగన్ ఆకాశాన విహరిస్తే.. కింద భూమి మీద ట్రాఫిక్ ఆంక్షలు విధించేవారు. అటువంటిది అధికారం తారుమారు కావడంతో పరిస్థితి తలకిందులైంది. కనీసం ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వకుండా ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు. ప్రస్తుతం జగన్ ఒక సాధారణ ఎమ్మెల్యే. పులివెందుల శాసనసభ్యులు మాత్రమే. అందుకే ఈ అవమానాలు, చీత్కారాలు. జగన్ సైతం అసెంబ్లీకి హాజరు కావడం డౌటే. తొలి రోజు ప్రమాణస్వీకారం కాబట్టి.. బయటకు రాకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురు ఎదురవుతాయని భావించి ఆయన అసెంబ్లీకి వచ్చారు. అయినా సరే ఆకతాయిల బెడద తప్పలేదు.