Team India : ఇకపై ప్రతీ మ్యాచ్ కీలకమే..టీమిండియా చేయాల్సిందేంటీ?

నిన్న దుబాయ్ వేదిక ఇండియా-పాక్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ ప్రియులు ఆశించింది ఒకటైతే.. జరిగింది మరొకటి.. గతంలో మాదిరిగానే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగుతుందని అభిమానులు భావించారు. కానీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా పాకిస్థాన్ ఈసారి రెచ్చిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో భారత్ కంటే పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసింది. అదేవిధంగా Team India చేసిన తప్పిదాలు కూడా పాకిస్థాన్ గెలుపునకు కలిసొచ్చాయి. దీంతో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో తొలిసారి […]

Written By: NARESH, Updated On : October 25, 2021 1:15 pm
Follow us on

నిన్న దుబాయ్ వేదిక ఇండియా-పాక్ మ్యాచ్ జరిగింది. క్రికెట్ ప్రియులు ఆశించింది ఒకటైతే.. జరిగింది మరొకటి.. గతంలో మాదిరిగానే మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠగా సాగుతుందని అభిమానులు భావించారు. కానీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా పాకిస్థాన్ ఈసారి రెచ్చిపోయింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ లో భారత్ కంటే పాకిస్థాన్ మెరుగైన ప్రదర్శన చేసింది. అదేవిధంగా Team India చేసిన తప్పిదాలు కూడా పాకిస్థాన్ గెలుపునకు కలిసొచ్చాయి. దీంతో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో తొలిసారి పాకిస్థాన్ భారత్ పై విజయకేతనం ఎగురవేసి తమేమీ తక్కువకాదని నిరూపించుకుంది.

ఈ మ్యాచ్ లో టీంఇండియానే ఫెవరేట్ గా బరిలో దిగింది. దుబాయ్ లో టీంఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ లో మెరుగైన ప్రదర్శన చేశారు. దీంతో ఇక్కడి వాతావరణం వారికి అలవాటైంది. దీనికితోడు వరల్డ్ కప్ లాంటి టోర్నిల్లో పాకిస్థాన్ కు భారత్ పై అధ్వానమైన రికార్డు ఉంది. పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ సైతం భారత్ కంటే మెరుగ్గా ఏమీలేదు. ఈ పరిస్థితుల్లో గెలుపు భారత్ వైపు ఉంటుందని అంతా భావించారు. కానీ పాకిస్థాన్ ప్లేయర్లు ఈ మ్యాచ్ లో తొలి నుంచి కసితో ఆడారు. అయితే టీంఇండియాలో మాత్రం ఆ కసి ఎక్కడ కన్పించలేదు. ఇదే ఓటమి కారణమని విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

క్రికెట్లో గెలుపొటములు సహజమే. కానీ Team India ఓడిన తీరును మాత్రం సగటు ప్రేక్షకుడు జీర్ణించుకోలేక పోతున్నాడు. బ్యాటింగులో పేకమేడల్లా కూలిపోవడం.. జట్టుకు అవసరమైన సమయంలో వికెట్లను కోల్పోవడం ఈ మ్యాచ్ లో కన్పించింది. పడుతూ లేస్తూ 151 పరుగుల లక్ష్యాన్ని భారత్ పాకిస్థాన్ ముందు ఉంచింది. అయితే ఏ దశలోనూ టీంఇండియా బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టిన దాఖలాలు కన్పించలేదు. పాకిస్థాన్ ఓపెనర్లు ఇద్దరే పరుగులు రాబడుతూ మ్యాచ్ ను ఫినిష్ చేశారు. దీంతో 10వికెట్లతో తేడాతో పాకిస్థాన్ ఘన విజయం సాధించింది.

గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో భారత్ బొక్కబొర్లా పడటంతో ఇప్పుడు ప్రతీ మ్యాచ్ టీంఇండియాకు సవాలుగా మారింది. ఇక నుంచి భారత్ ఆడే ప్రతీ మ్యాచ్ కీలకంగా మారనుంది. అన్ని మ్యాచుల్లో గెలిస్తేనే భారత్ కు సెమిఫైనల్ అవకాశం ఉంటుంది. ఏమాత్రం తప్పిదం చేసిన టీంఇండియా ఇంటిముఖం పట్టడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్ మ్యాచ్ లో టీంఇండియా బ్యాటింగ్, బౌలింగ్ లో పూర్తిగా విఫలమైంది. ఈ తప్పిదాల నుంచి టీంఇండియా గుణపాఠం నేర్చుకొని బ్యాటింగ్, బౌలింగ్ బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

భారత్‌ తదుపరి మ్యాచ్ వచ్చే ఆదివారం జరుగనుంది. న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇక్కడి నుంచి భారత్ ఎదుర్కోనే ప్రతీ మ్యాచ్ కూడా టీంఇండియాకు అగ్ని పరీక్షగా మారనుంది. ప్రతీ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఈజీగా సెమిస్ వెళ్లొచ్చు. ప్రపంచ క్రికెట్లలో అత్యుత్తమ ప్లేయర్లు కలిగిన భారత్ కు వరుసగా విజయాలు సాధించడం కష్టమేమీ కాదు. అయితే సమిష్టిగా రాణిస్తేనే విజయం దక్కుతుంది. Team India పూర్తిగా ఓపెనర్లపైనే ఆధారపడినట్లు కన్పిస్తోంది. దీని నుంచి టీం ఇండియా త్వరగా బయట పడాల్సి ఉంది.

భారత ప్లేయర్లు పేకమేడలను తలపించేలా కాకుండా క్రీజులో కొద్దిసేపు కుదురుకునేలా ఆడితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బౌలింగ్ లోనూ చాలా మార్పులు చేయాల్సి ఉంది. అనవసర ప్రయోగాలకు పోకుండా అశ్విన్ లాంటి సీనియర్లను, కీలక దశలో బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్లను జట్టులోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గత తప్పిదాల నుంచి Team India త్వరగా మెల్కోని వరల్డ్ కప్ సాధిస్తేనే పాకిస్థాన్ తో జరిగిన ఘోర పరాజయాన్ని అభిమానులు మరిచిపోయే అవకాశం ఉంటుంది. ఆ దిశగా భారత్ విజయాల సాధించాలని ఆకాంక్షిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ టీంఇండియా..!