Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వర్మ తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా వర్మ గురించి చెప్పాలంటే ఆ విషయం , ఈ విషయం అని లేకుండా అన్నిట్లో వేలు పెట్టి ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ట్విట్టర్ లో పలు అంశాలపై స్పందిస్తూ సోషల్ మీడియా ఎప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తూ ఉంటారు. ఈ సారి ఏకంగా ఈయన ఢిల్లీ సీఎం పైనే సెటైర్లు వేశారని చెప్పాలి. నిన్న దుబాయ్ వేదికగా టీ-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఇండియా – పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో ప్రపంచ కప్ లో ఎప్పుడూ పాక్ స్థాన్ జట్టు పై ఓడిపోని భారత్… నిన్న ఘోరంగా ఓటమి పాలైంది.

Will u say the same to pakistan sir , if india won ? Just asking ! https://t.co/vn7Z8B40ZJ
— Ram Gopal Varma (@RGVzoomin) October 24, 2021
ఈ నేపధ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. క్రీడల్లో గెలుపు, ఓటములు చాలా సహజమని… చెబుతూ టీమిండియాకు సలహాలు ఇచ్చారు. అయితే కేజ్రీవాల్ చేసిన ట్వీట్ కు… ఆర్జీవి తనదైన శైలిలో సూపర్ కౌంటర్ ఇచ్చారు. ” నిన్నటి మ్యాచ్ లో టీమిండియా, పాక్ స్థాన్ జట్టుపై గెలిచి ఉంటే పాక్ క్రికెటర్లకు ఇలాగే సూచనలు ఇస్తారా… అంటూ కేజ్రీవాల్ ట్వీట్ కు రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అలానే మ్యాచ్ ఓడిపోయినప్పటికి ప్రత్యర్థి జట్టును ప్రశంసించిన కోహ్లీకి వందనాలు అంటూ మరో ట్వీట్ చేశాడు వర్మ.