India vs England: టాస్ గెలిచిన ఇంగ్లండ్.. రెండు మార్పులతో టీమిండియా

ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ కీలకమైన టెస్ట్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 3వ టెస్టులాగానే టీమిండియాను కుప్పకూల్చాలని అనుకుంటున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ ప్రారంభించి నిలకడగా ఆడుతోంది. గత మూడు టెస్టులలో ఒక్క మార్పులేకుండా ఆడిన టీమిండియా అనూహ్యంగా బ్యాటింగ్ వైఫల్యం ఉంటే.. బౌలింగ్ లో మార్పులు చేసి షాకిచ్చింది. పేసర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ స్థానంలో […]

Written By: NARESH, Updated On : September 2, 2021 4:06 pm
Follow us on

ఇండియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభమైంది. ఈ కీలకమైన టెస్ట్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. 3వ టెస్టులాగానే టీమిండియాను కుప్పకూల్చాలని అనుకుంటున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ ప్రారంభించి నిలకడగా ఆడుతోంది.

గత మూడు టెస్టులలో ఒక్క మార్పులేకుండా ఆడిన టీమిండియా అనూహ్యంగా బ్యాటింగ్ వైఫల్యం ఉంటే.. బౌలింగ్ లో మార్పులు చేసి షాకిచ్చింది. పేసర్లు మహ్మద్ షమీ, ఇషాంత్ శర్మ స్థానంలో శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. ఇక ఈ మ్యాచ్ లో అశ్విన్ ఆడుతాడని.. రహానే, పంత్ స్తానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని అనుకున్నా అందరికీ షాకిస్తూ బ్యాటింగ్ లో ఎలాంటి మార్పులు లేకుండా టీమిండియా బరిలోకి దిగింది.

ఒకే ఒక ఆఫ్ స్పిన్నర్ ను తీసుకుంటామన్న కోహ్లీ ఈ మేరకు రవీంద్ర జడేజానే తుదిజట్టులో చోటు కల్పించాడు. ఇక ఫామ్ కోల్పోయి అష్టకష్టాలు పడుతున్న రహానే, పంత్ లకు మరో అవకాశాన్ని టీమిండియా కల్పించింది. వారితోపాటు సేమ్ బ్యాటింగ్ లైనప్ ను కొనసాగించారు..

భారత తుది జట్టు ఇదే..
రోహిత్, కేఎల్ రాహుల్, పూజారా, కోహ్లీ, అజింక్యా రహానే, పంత్, జడేజా, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్,