IND vs ENG : ఈ మ్యాచ్లో అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మీదనే ఉంది. విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా దారుణమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల టెస్ట్ సిరీస్ లలోనూ విఫలమయ్యాడు. త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ ను ఉపయోగించుకోవాలని విరాట్ కోహ్లీ భావించాడు. అయితే అతడు నెట్స్ లో సాధన చేస్తుండగా మోకాలికి గాయమైంది. తుది సామర్ధ్య పరీక్షలో అతడు విఫలం కావడంతో తొలి వన్డే మ్యాచ్ కు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. అతడి స్థానంలో హర్షిత్ రాణా కు అవకాశం కల్పించారు.. మహమ్మద్ షమీ సుదీర్ఘకాలం తర్వాత టీమిండియాలోకి అడుగు పెట్టాడు. అతడితోపాటు హర్షిత్ రాణా పేస్ బౌలింగ్ బాధ్యతలు భుజాన వేసుకొనున్నారు. ఇక కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు. నాగ్ పూర్ మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటుందని.. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ ఆడతాడని వార్తలు వినిపించినప్పటికీ.. టీమిండియా మేనేజ్మెంట్ కేఎల్ రాహుల్ వైపు మొగ్గు చూపించింది. ఒకవేళ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకుంటే శ్రేయస్ అయ్యర్ రిజర్వ్ బెంచ్ కు పరిమితమైపోతాడని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే శ్రేయస్ అయ్యర్ కు అవకాశం కల్పించిన టీమిండియా మేనేజ్మెంట్.. రిషబ్ పంత్ ను రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసింది.
హార్దిక్ పాండ్యా వచ్చేసాడు
ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యాకు టీమిండియా మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ఇటీవల టీ20 క్రికెట్లో అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతి, బ్యాట్ తో సత్తా చూపిస్తున్నాడు. ఆల్ రౌండర్ కోటాలో అతనికి స్థానం లభించింది.. హర్షిత్ రాణా, షమీ, హార్దిక్ పాండ్యా పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తారు.. అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా స్పిన్ బౌలింగ్ వేస్తారు.. ఆరుగురు బౌలర్లు కూడా అనుభవజ్ఞులు కావడంతో.. ఇంగ్లాండ్ జట్టుకు తీవ్రమైన పోటీ తప్పకపోవచ్చు. అయితే ప్రారంభంలో ఈ మైదానం పేస్ బౌలర్లకు కాస్త అనుకూలిస్తుందని క్యూరేటర్ చెబుతున్నారు. ఒకవేళ అదే గనుక వాస్తవమైతే టీమిండియా పేస్ బౌలర్లు ప్రారంభంలో ఇంగ్లాండ్ జట్టుపై కాస్త ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. మధ్య ఓవర్లలో స్పిన్ బౌలర్లు ప్రభావం చూపిస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ అదరగొట్టే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్లో కులదీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. తుది జట్టులో కులదీప్ యాదవ్ కు జట్టు మేనేజ్మెంట్ స్థానం కల్పించింది. ఇక ఈ మైదానంపై ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు 288 వరకు పరుగులు చేసే అవకాశం ఉంది. అయితే ఇంగ్లాండ్ కనక ఆ స్థాయిలో పరుగులు చేస్తే.. దానిని చేజ్ చేయడానికి టీమిండియా పోరాడాల్సి ఉంటుంది. పైగా ఇంగ్లాండ్ కూడా ఇదే స్థాయిలో పేస్, స్పీన్ బౌలర్లతో రంగంలోకి దిగింది. చేజింగ్ చేసే జట్టుకు మైదానంలో కురిసే మంచు కాస్త ప్రతిబంధకంగా మారే అవకాశం ఉంది. మరి దీనిని టీమిండియా బ్యాటర్లు ఎలా అధిగమిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.