Megastar Chiranjeevi
Megastar Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికి వైవిధ్య భరితమైన సినిమాలను చేయగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులు మాత్రం కొందరే ఉన్నారు. అందులో సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga)ఒకరు…ఆయన చేసిన సినిమాలన్నీ ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించి పెడుతున్నాయి. మరి ఇప్పుడు ఆయన ప్రభాస్ (Prabhas) తో ‘స్పిరిట్ ‘ (spirit) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ లో తెరకెక్కుతున్న నేపధ్యం లో ఈ సినిమా స్కేల్ కూడా భారీ రేంజ్ లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ప్రభాస్ కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించలేదు సాహో(Sahoo) సినిమాలో కొద్దిసేపు కనిపించినప్పటికీ ఫుల్ లెంత్ పోలీసు ఆఫీసర్ గా అయితే చేయలేదు. తద్వారా ఈ సినిమా మీద ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తైతే ఇకమీదట చేయబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగ చిరంజీవి అభిమాని అనే విషయం మనందరికి తెలిసిందే. ఇక దానికోసమే ఆయన నిర్మించుకున్న ఆఫీసులో సైతం చిరంజీవి వింటేజ్ ఫోటోని పెట్టుకున్నాడు.
ఇక చిరంజీవి అంటే అతనికి ఆరాధ్య దైవం అని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ముఖ్యంగా మాస్టర్ సినిమాలో చిరంజీవి సిగరెట్ తాగే స్టైల్ చూసే తను కూడా సిగరెట్ తాగడం అలవాటు చేసుకున్నాను అని కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. నిజానికి సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడంలో చాలా వరకు కృషి చేస్తున్నాడు.
తద్వారా ఆయన సినిమాల్లో నటించడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు సైతం పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఫ్యూచర్ లో ఆయన ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో కూడా సినిమాలను ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అనిమల్ (Animal) సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కింది. తర్వాత చేయబోయే సినిమాలు కూడా బోల్డ్ కంటెంట్ తోనే తెరకెక్కుతాయా లేదంటే తన పంథాను మార్చుకొని డిఫరెంట్ స్టైల్లో తీసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…