Harry Brook: ఇటీవల కాలంలో సరిగ్గా ఆడలేక పోతున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడలేక పోతున్నాడు. స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ నిర్మించలేకపోతున్నాడు. ఇటువంటి స్థితిలో అతనికి జట్టులో అవకాశం కల్పించడం.. జట్టు నాయకుడిగా ప్రమోషన్ ఇవ్వడం చాలామందికి నచ్చడం లేదు. దీంతో ఇంగ్లాండ్ జట్టు మేనేజ్మెంట్ మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వచ్చిన విమర్శలకు అతడు సరిగా సమాధానం చెప్పాడు. మొత్తంగా మూడు సంవత్సరాల తర్వాత తమ జట్టుకు తొలి విదేశీ ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాన్ని అందించి అదరగొట్టాడు..
ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో భాగంగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 53 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ జట్టు సారధి బ్రూక్ 66 బంతుల్లో 136 పరుగులు చేశాడు. మ్యాచ్ కు ముందు పిచ్ ను పరిశీలించిన అతడు.. అసంతృప్తి వ్యక్తం చేశాడు. తద్వారా వివాదాన్ని రాజేశాడు. ఆ తర్వాత అతడు సెంచరీ చేసి.. ఆతిధ్య జట్టుకు చుక్కలు చూపించాడు.
బ్రూక్ ఈ మ్యాచ్లో 11 ఫోర్లు, 9 సిక్సర్లతో 136 పరుగులు చేశాడు. తద్వారా ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 350 పరుగులు చేశాడు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కేక్ వాక్ లాగా సాగలేదు. బెన్ డకెట్ ప్రారంభంలోని ఓటయ్యాడు. 24 పరుగులు చేసిన రేహాన్ అహ్మద్ హసరంగ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో 40 పరుగులకే ఇంగ్లాండు రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో వచ్చిన రూట్ 111 పరుగులు చేశాడు. బెతెల్ 65 పరుగులు చేశాడు. ఈ దశలో వచ్చిన బ్రూక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. రూట్ తో కలిసి ఏకంగా నాలుగో వికెట్ కు 191 పరుగులు జోడించాడు. 40 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన బ్రూక్.. చివరి 50 పరుగులను కేవలం 17 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. చివరి 10 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టుకు నమ్మశక్యం కాని విధంగా 130 వచ్చాయి. దీంతో ఇంగ్లాండ్ స్కోర్ ఏకంగా రాకెట్ వేగంతో దూసుకుపోయింది.
ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన యాషెస్ సిరీస్లో మద్యం తాగాడని బ్రూక్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు . అంతంతమాత్రంగా అతడు ఆడుతున్న నేపథ్యంలో జట్టుకు నాయకుడిగా ఎలా ఉంటాడని చాలామంది విమర్శించారు. ఇన్ని ఇబ్బందుల నేపథ్యంలో బ్రూక్ తన సెంచరీ తో అదరగొట్టాడు. ఇంగ్లాండ్ విధించిన 358 లక్ష్యాన్ని చేదించడంలో శ్రీలంక మొదట్లో సమర్థవంతంగా బ్యాటింగ్ చేసినప్పటికీ.. ఆ తర్వాత ఒత్తిడికి గురైంది. 46.4 ఓవర్లలో 304 పరుగులకు ఆల్ అవుట్ అయింది. పవన్ 121, నిస్సాంక 50 పరుగులు చేశారు.